News March 18, 2024

స్లీపర్ క్లాస్‌లో ఇదీ పరిస్థితి!

image

గత కొన్ని నెలలుగా భారతీయ రైల్వేలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనరల్ బోగీలను తగ్గించడంతో స్లీపర్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఉంటోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనివల్ల స్లీపర్ బుక్ చేసుకుని, లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నిలబడేందుకూ ప్లేస్ ఉండట్లేదని, 3ACలోనూ అదే పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లతో పాటు సామాన్యుల రైళ్లనూ పట్టించుకోవాలని కోరుతున్నారు.

News March 18, 2024

ఛార్జింగ్ కేబుల్‌‌కు టేప్ అంటించి వాడుతున్నారా?

image

చాలామంది ఛార్జింగ్ కేబుల్ పాడై, వైర్లు బయటికి వచ్చినా టేపు అంటించి వాడుతుంటారు. అలా చేయడం ప్రమాదమని UKలోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే ఫోన్ పేలిపోవడంతో పాటు మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉందట. ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. నకిలీ/తక్కువ నాణ్యత ఉన్న ఛార్జర్లు కూడా వాడటం మంచిది కాదని తెలిపింది.

News March 18, 2024

ఈ పులావ్.. వయాగ్రాతో సమానం!

image

ప్రపంచంలో ఎన్నో రకాల పులావ్స్ ఉన్నా ఉజ్బెకిస్థాన్‌ పులావ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది వయాగ్రాలా పని చేస్తుందట. ఆ దేశ జాతీయ వంటకం పులావ్. ఈవెంట్ ఏదైనా ఈ వంటకం ఉండాల్సిందే. దీన్ని యునెస్కో కూడా గుర్తించింది. ఇందులో పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే లక్షణాలున్నాయని, వయాగ్రాతో సమానమని ప్రజలు నమ్ముతారు. జీవితంలో ఒకే రోజు బతికి ఉంటామని తెలిస్తే వారు కచ్చితంగా పులావ్ తినాలని కోరుకుంటారట.

News March 18, 2024

యూత్‌కి కొత్త క్రష్.. ఎవరీ శ్రేయాంక పాటిల్?

image

ఆర్సీబీ WPL కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాంక పాటిల్ నేషనల్ క్రష్‌గా మారారు. నెట్టింట ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన పాటిల్, సీజన్‌లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 21 ఏళ్ల శ్రేయాంక బెంగళూరు బాలికే. కర్ణాటక తరఫున ఆడుతున్నారు. గత ఏడాది భారత జట్టులోకీ ప్రవేశించిన ఆమె, మున్ముందు మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంది.

News March 18, 2024

సోఫా, గాజు ముక్కలు, స్పాంజ్ తింటున్న బాలిక

image

UKకు చెందిన 3ఏళ్ల బాలిక వింటర్ ఆటిజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తోంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడల ప్లాస్టర్ వంటివి ఆహారంగా తింటోంది. నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తోందని.. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లు మొత్తం తినేస్తోందని తల్లి స్టేసీ తెలిపారు. ఎప్పుడూ తినకూడని వస్తువులు తినేందుకు తహతహలాడుతుంటుందని చెప్పారు. బాలికకు 13 నెలల వయసు నుంచి పైకా వ్యాధి ప్రారంభమైందని తెలిపారు.

News March 18, 2024

మంగళగిరిలో పేదరికం లేకుండా చేస్తా: లోకేశ్

image

AP: తనను గెలిపిస్తే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకేశ్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చాక మంగళగిరికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పేదరికం లేకుండా చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని కంఠంరాజు కొండూరులో రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు.

News March 18, 2024

దళితబంధుతో ఎదురుదెబ్బ తగిలింది: KCR

image

TG: ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు పార్టీలోకి వస్తే.. స్వార్థపు నాయకుల అవసరం ఉండదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ‘ఎన్నికల్లో ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిద వెంట పోతేనే గుర్రాల విలువ తెలుస్తది. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మారు. త్వరలోనే వారు నిజాన్ని గ్రహిస్తారు. దళిత బంధు స్కీమ్ ఎదురుదెబ్బ తీయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ పథకంతో లబ్ధి పొందిన కుటుంబాల జీవనం మెరుగైంది’ అని చెప్పారు.

News March 18, 2024

BRS ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్: కేసీఆర్

image

TG: RS.ప్రవీణ్ కుమార్‌ను BRS ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. BRS పార్టీని పునర్నిర్మిస్తానని, కమిటీలు వేస్తామని శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

News March 18, 2024

ALERT: మీ పళ్లు పుచ్చిపోయాయా?

image

పళ్లు పుచ్చిపోయిన వ్యక్తికి గుండెలో నొప్పి రావడంపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ వైద్యుడు రిప్లై ఇచ్చారు. ‘గట్టిగా ఏదైనా కొరికినప్పుడు పుచ్చిపళ్లలో ఉన్న బ్యాక్టీరియా సరాసరి రక్తంలోకి వెళ్లి అక్కడి నుంచి గుండెలోకి వెళ్తుంది. గుండె కవాటాల (వాల్వ్స్)లో పుండ్లు పుట్టిస్తుంది. దీంతో జ్వరం, ఛాతినొప్పి వస్తుంది. వెంటనే వైద్యం చేయకపోతే గుండె పాడై చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే అందరిలో ఇలా జరగదు’ అని తెలిపారు.

News March 18, 2024

జీవితం కష్టమైనది: మాజీ క్రికెటర్

image

మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆసుపత్రిలో చేరారు. బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ‘జీవితం కష్టమైనది’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీ కామెంట్రీ వినడానికి ఎదురుచూస్తున్నా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు’ అంటూ శివరామకృష్ణన్ రిప్లై ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు.