India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది. తాజాగా పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోను డైరెక్టర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఊహించనిది ఆశించండి’ మార్చి 19న రాబోతోందని ట్వీట్ చేశారు. దీంతో ఈ మూవీ ప్రోమో వీడియో రాబోతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో పవన్ డైలాగ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
TG: ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయి. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారు. వాహన రిజిస్ట్రేషన్‌లో టీఆర్ఎస్‌కు నకలుగానే టీఎస్ తీసుకొచ్చారు’ అని ఆరోపించారు.
TG: తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ప్రజాపాలన అందించామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు.
డిజిటల్ మీడియా రాజకీయ ప్రకటనలకు వేదికగా మారుతోంది. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం.. గత 90 రోజుల్లో దేశవ్యాప్తంగా & తెలంగాణలో ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రకటనల కోసం అత్యధికంగా బీజేపీనే ఖర్చు చేసినట్లు తేలింది. ఆ తర్వాత వైసీపీ& ఏపీ ప్రభుత్వం వినియోగించిందట. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు Facebookలో యాడ్స్ ఇవ్వలేదట. 16 DEC 2023 నుంచి 14 మార్చి 2024 వరకు BJP రూ.6కోట్లు ఖర్చు చేసింది.
TG: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఇదిలా ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్‌లో ఒకే KYC విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోలు వరకు ఆయా సంస్థలకు KYC సమర్పించాల్సి వస్తోంది. అడ్రస్, ఫోన్ నంబర్ మారినా మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యే ఒకే KYC విధానాన్ని తేవాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రతిపాదించింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు PM మోదీ కొత్త బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధం చేశారని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వారికి ఉన్నాయి. దీంతో ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కొత్త కేసు పెట్టారు. విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. మద్యం కేసులో నిన్న ఆయన కోర్టుకు హాజరై బీజేపీ నేతల నోళ్లు మూయించారు’ అని ఆమె ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోని ప్రచార హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలన్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని బీఆర్ఎస్ విమర్శించింది. ‘రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? రైతుబంధును సీరియల్‌లాగా ఎంతకాలం సాగదీస్తారు? వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు?’ అంటూ 100 ప్రశ్నలు Xలో పోస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ తొలిరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో రెండు బృందాలు ఆమెను విచారిస్తున్నాయి. సా.5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. రేపు విజయ్ నాయర్, పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని సమాచారం.
Sorry, no posts matched your criteria.