India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ తొలిరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో రెండు బృందాలు ఆమెను విచారిస్తున్నాయి. సా.5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. రేపు విజయ్ నాయర్, పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని సమాచారం.
BRSతో పొత్తు రద్దుతో BSPకి RS ప్రవీణ్‌కుమార్ వీడ్కోలు పలికారు. బహుజనుల కోసం తాను KCRతో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన BRSలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇంకొందరు మాత్రం గతంలో KCRను తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు BRSలో చేరితే ప్రవీణ్‌కుమార్‌పై మరింత వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహుజనుల కోసం కొత్త పార్టీ పెట్టడం ఉత్తమమని కొందరంటున్నారు. దీనిపై మీ కామెంట్?
ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డారు. అతని గాయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అతని మోకాలికి గాయమైందని పేర్కొంది. దీంతో అతడు SL జట్టుకు దూరమయ్యారు. మరో 5 రోజుల్లోనే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, MI ఆడే ప్రారంభ మ్యాచులకు అతను అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
AP: ఇవాళ జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.
పాక్ నుంచి వచ్చిన 18మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా గ్లింప్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. తన రోల్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. ‘నేను దీని గురించి ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రాబోతోంది’ అని రిప్లై ఇచ్చారు.
TG: ఎమ్మెల్సీ కవితపై ఈడీ PMLA(ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ PMLA కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రూ.5లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. PMLA చట్టాన్ని NDA ప్రభుత్వం 2002లో రూపొందించింది.
TG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా, కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని తెలిపింది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని పేర్కొంది. కాపీయింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ముంబై వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయనకు సమన్లు పంపించడం ఇది తొమ్మిదోసారి. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ కోర్టుకు వెళ్లగా.. ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది. అక్కడా ఆయన నిన్న బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి సమన్లు ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.