India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాజాపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ‘అంతర్జాతీయ ఒత్తిళ్లకు మేం తలొగ్గం. యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలోనే ఆపలేం. గాజాపై దాడుల విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. మరికొన్ని వారాలపాటు దాడులు కొనసాగిస్తాం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకర దాడులు అందరూ మర్చిపోవచ్చు. కానీ మేం అంత త్వరగా మర్చిపోం’ అని ఆయన పేర్కొన్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తమను తిట్టినా పట్టించుకోమని స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నారు. ‘ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు రోహిత్ అనే మాటలకు మేమేమీ బాధపడం. మైదానంలో దిగినప్పుడు అలాగే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వచ్చాక తిరిగి తను మా మీద చాలా ప్రేమ చూపిస్తాడు. తనతో మా అందరికీ మంచి అనుబంధం ఉంది. మ్యాచ్‌లో నా బౌలింగ్ గురించి ఏం చెప్పడు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగవ్వమంటాడు’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులు రాజ్యసభ రూట్‌ను ఎంచుకున్నారు. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవనుంది. రాహుల్ గాంధీకి ఎప్పుడేం చేయాలో తెలీదు. ఎన్నికల సమయంలో యాత్రలు చేస్తుంటారు’ అని విమర్శించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ
1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
1837: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం
1953 – పశ్చిమ టర్కీలో భూకంపం సంభవించి 1,070 మంది మరణం
AP: ప్రజాగళం సభపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సభకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రజానీకం ఎన్డీయేకు పూర్తి మద్దతుగా ఉన్నారు. అవినీతిమయమైన వైసీపీ పాలన నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రజలు నమ్ముతున్నారు’ అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.
తేది: మార్చి 18, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:10
సూర్యోదయం: ఉదయం గం.6:22
జొహర్: మధ్యాహ్నం గం.12:24
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేదీ: మార్చి 18, సోమవారం,
ఫాల్గుణము శుద్ధ నవమి: రాత్రి 10:49 గంటలకు
ఆరుద్ర: సాయంత్రం 06:10 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:39-01:27 గంటల వరకు,
మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:40-03:22 గంటల వరకు
ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ప్రతిభతో ఆ జట్టు కప్ కొట్టింది. టోర్నీలో ఆమె మొత్తం 347 పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. అలాగే బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. టోర్నీలో 7 వికెట్లు కూడా పడగొట్టారు. ముంబైపై 6 వికెట్లు తీసి డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా పెర్రీ నిలిచారు. ఫైనల్లో కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా ఆడి జట్టును గెలిపించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.