News March 18, 2024
ఏపీ ప్రజల మద్దతు ఎన్డీయేకే: ప్రధాని మోదీ
AP: ప్రజాగళం సభపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సభకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రజానీకం ఎన్డీయేకు పూర్తి మద్దతుగా ఉన్నారు. అవినీతిమయమైన వైసీపీ పాలన నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రజలు నమ్ముతున్నారు’ అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.
Similar News
News October 12, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి నవనీత్ కౌర్ దూరం!
బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.
News October 12, 2024
తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.
News October 12, 2024
20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్
హరియాణా ఎన్నికల ఫలితాల విషయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై EC విచారణ జరుపుతుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కౌంటింగ్‌కి ఉపయోగించిన EVMలు, వాటి బ్యాటరీ సామర్థ్యాలపై కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారని, అక్రమాలు జరిగిన EVMలను సీల్ చేయాల్సిందిగా ఆయన కోరారు.