News March 17, 2024

కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ED సమన్లు

image

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయనకు సమన్లు పంపించడం ఇది తొమ్మిదోసారి. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ కోర్టుకు వెళ్లగా.. ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది. అక్కడా ఆయన నిన్న బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి సమన్లు ఇచ్చింది.

News March 17, 2024

జగన్‌పై మోదీ విమర్శలు చేస్తారా?

image

AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్‌పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.

News March 17, 2024

ఎంపీగా పోటీ చేయడం లేదు: దానం

image

TG: ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా ఇటీవల దానం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

News March 17, 2024

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై మరో కేసు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ మరో కొత్త కేసు ఫైల్ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కొత్త కేసుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న మద్యం పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

News March 17, 2024

బిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి

image

దివంగత పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మరో బిడ్డకు జన్మనిచ్చారు. 58ఏళ్ల వయసులో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తండ్రి బల్కార్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాగా, సిద్ధూ 2022 మేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏకైక కుమారుడు మరణించడంతో ఆయన తల్లిదండ్రులు చరణ్ కౌర్(58), బాల్‌కౌర్ సింగ్‌(60) IVF పద్ధతిలో మరో బిడ్డకు జన్మనిచ్చారు.

News March 17, 2024

RTC ఉద్యోగులకు ప్రభుత్వం షాక్

image

TG: ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం HRAలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల GHMC పరిధిలో పనిచేసే ఉద్యోగులకు అధిక నష్టం కలగనుంది. ఇక్కడ ఇప్పటివరకు 30% ఉన్న HRAను 24శాతానికి పరిమితం చేసింది. అలాగే KNR, ఖమ్మం, MBMR, NZB, గోదావరిఖని, WGLలో పనిచేసే వారికి 17%, మిగతా జిల్లాల్లోని వారికి 13-11 శాతానికి తగ్గించింది.

News March 17, 2024

ఏపీ, తెలంగాణలో మోదీ బిజీబిజీ

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న నాగర్‌కర్నూల్‌ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన రాత్రి HYDలోని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఇవాళ సాయంత్రం మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఏపీలోని గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన చిలకలూరిపేటలో నిర్వహించే ప్రజాగళం సభకు హాజరవుతారు. తిరిగి రాత్రికి HYD చేరుకుంటారు. రేపు జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News March 17, 2024

ట్రాన్స్‌కో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

image

TG: ట్రాన్స్‌కో ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ సంస్థ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండేళ్లపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News March 17, 2024

RCBకి పెర్రీ కప్ అందిస్తారా?

image

WPLలో నేడు ఢిల్లీ, బెంగళూరు ఫైనల్ ఆడనున్నాయి. RCB ఆశలు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీపైనే ఉన్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి బంతికి, బ్యాటుకు పెర్రీ పని చెప్పారు. 312 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆమె బౌలింగ్‌లోనూ ఉత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశారు. అయితే ఆమె సెకండ్ అటెంప్ట్‌లోనే ఆస్ట్రేలియాకు ODI WC, T20WC అందించారు. దీంతో రెండో WPLలో RCBకి కప్ అందిస్తారని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.

News March 17, 2024

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్, హరీశ్

image

TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను కలిసేందుకు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు.