India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యింది. 2013 జూన్ 23న ఇంగ్లండ్‌పై ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. తొలుత భారత్ 129/7 స్కోర్ చేసింది. కోహ్లీ 43, జడేజా 33, ధవన్ 31 పరుగులతో రాణించారు. తర్వాత ENGని 124/8కే బౌలర్లు కట్టడి చేశారు. జడేజా, అశ్విన్, ఇషాంత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా వచ్చే ఏడాది పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
గత ఏడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్‌లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. రేపు జరగనున్న టీ20 WC మ్యాచులో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సుంది. ఇది జరగాలంటే ఎల్లుండి BANపై AFG గెలవాల్సి ఉంటుంది. AUS, AFG రెండూ ఓడితే వీటిలో మెరుగైన NRR ఉన్న జట్టు INDతో పాటు SFకి వెళ్తుంది.
AP: కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, ఇతర పనులకు కేటాయించిన నిధులను దారి మళ్లించిందని మండిపడ్డారు. దీనివల్ల గుంటూరులో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. నిధులను సమీకరించి పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ఐఈడీలతో పేల్చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కన్నుమూయగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సిలిగురి-టేకులగూడెం సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
TG: ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, KNR, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, WGL, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు 40KM వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొంది. మరోవైపు HYDలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం, LBనగర్, హయత్‌నగర్‌లో వరదనీరు రోడ్లపై చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
T20WCలో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న బుమ్రాపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. ‘అతను జట్టుకు RBI లాంటి వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసినా రాణిస్తాడు. ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు. బౌన్సర్లపై ఎక్కువగా ఆధారపడకుండా లైన్ అండ్ లెంగ్త్‌ను కొనసాగిస్తాడు’ అని పేర్కొన్నారు. కాగా బుమ్రా WCలో 19 ఓవర్లలో 65 పరుగులే ఇచ్చి 10 వికెట్లు తీశారు.
TG: CM రేవంత్ ఆదేశాలతో పోలీసులు HYD ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు కాంగ్రెస్ Xలో రాసుకొచ్చింది. ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్డుపై అల్లర్లు సృష్టించొద్దు. అనుమానాస్పద వ్యక్తులకు వాహనంపై లిఫ్ట్ ఇవ్వొద్దు. దుకాణాలను రా.10.30-11 గంటల్లోపు మూసేయాలి. గంజాయి బ్యాచ్‌ను వదిలిపెట్టేది లేదు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.
T20 WC రేసులో వెస్టిండీస్ లేకపోతే తాను టీమ్ ఇండియాకే మద్దతునిస్తానని మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తెలిపారు. బంగ్లాదేశ్‌పై విజయం అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఇచ్చేందుకు ఆయన భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. ‘మీ జట్టు చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ బాగా ఆడారు. గడ్డు పరిస్థితిని దాటి వచ్చిన పంత్‌ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. తను మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటాడు’ అని పేర్కొన్నారు.
AP: అమెరికాలోని టెక్సాస్‌లో దుండగుల కాల్పుల్లో బాపట్ల యువకుడు దాసరి గోపీకృష్ణ <<13494260>>మృతి<<>> చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని సీఎం ట్వీట్ చేశారు.
శ్రీకృష్ణ జన్మస్థలమైన UPలోని మథురలో ‘కల్కి 2898AD’ థీమ్ సాంగ్‌ను నేడు ఆవిష్కరించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. రేపు పాటను విడుదల చేస్తామని పేర్కొంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈనెల 27న విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నాగార్జున, రాజమౌళి, శింబు, లోకేశ్ కనగరాజ్ వంటి సినీ ప్రముఖులు కల్కి టీమ్‌ను అభినందిస్తూ <
Sorry, no posts matched your criteria.