News June 22, 2024

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

image

AP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైంది. పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు CBN దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు.. ఇటీవల టీడీపీలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు.

News June 22, 2024

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రేపు భారత జట్టు ప్రకటన?

image

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టును BCCI రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, ఐపీఎల్‌లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లను సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. జులై 6 నుంచి జరిగే ఈ 5 మ్యాచుల సిరీస్‌కు హార్దిక్/సూర్య కెప్టెన్సీ వహించే ఛాన్సుందని, ఒకవేళ వారికి రెస్ట్ ఇస్తే శ్రేయస్, రుతురాజ్, పంత్‌లో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చని క్రీడా విశ్లేషకుల అంచనా.

News June 22, 2024

రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన విద్యార్థిని

image

ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే వైద్య విద్యార్థిని రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం అందజేశారు. పొలం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, బంగారు గాజులు అమ్మి పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళంగా ఇచ్చినట్లు పేరెంట్స్ తెలిపారు. తన తండ్రి మనోజ్‌తో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. వైష్ణవిని అభినందించిన CM ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

News June 22, 2024

జగన్‌పై పులివెందుల ప్రజలు తిరగబడ్డారు: TDP

image

AP: వైఎస్ జగన్ ఫ్యూడల్ మనస్తత్వంపై పులివెందుల వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని టీడీపీ ట్వీట్ చేసింది. జగన్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొంది. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమై ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపింది. జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని రాసుకొచ్చింది.

News June 22, 2024

T20WC: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బ్యాటింగ్

image

T20WC సూపర్-8లో భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
IND: రోహిత్, కోహ్లి, పంత్, సూర్య, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, బుమ్రా
BAN: అంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్, తౌహిద్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్, మహేదీ హసన్, తంజిమ్, ముస్తాఫిజుర్

News June 22, 2024

T20WC: బౌలర్ల జోరు.. అయినా సిక్సర్ల హోరు

image

ఈ టీ20 వరల్డ్ కప్‌లో బౌలర్లు సత్తా చాటుతున్నప్పటికీ బ్యాటర్లు సిక్సర్ల జోరును కొనసాగిస్తున్నారు. WC హిస్టరీలో అత్యధిక సిక్సర్లు(412) నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. 2021లో 405 సిక్సర్లు బాదగా, ప్రస్తుతం ఆ రికార్డు బ్రేకయ్యింది. మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున 500 మార్క్‌కు చేరే అవకాశం ఉంది. 2022లో 331, 2016లో 314, 2014లో 300 సిక్సర్లు నమోదయ్యాయి.

News June 22, 2024

వీటిపై GST రేట్లు తగ్గింపు

image

1.రైల్వేశాఖ అందించే ప్లాట్‌ఫామ్ టికెట్లు, వెయిటింగ్, లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు, ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ ఉండదు.
2.అన్ని రకాల మిల్క్ క్యాన్లు, కార్టన్ బాక్సులపై జీఎస్టీ 18% నుంచి 12%కు తగ్గింపు
3.సోలార్ కుక్కర్లపై జీఎస్టీ 18% నుంచి 12%కు తగ్గింపు
4.ఫైర్ స్ప్రింక్లర్లతో పాటు అన్ని రకాల స్ప్రింక్లర్లపై 12% జీఎస్టీ
>>53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

News June 22, 2024

AP: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.

News June 22, 2024

హాస్టళ్లలో ఉండే వారికి GOOD NEWS

image

పలు వస్తువులు, సేవలపై GSTని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సంబంధం లేని హాస్టళ్లను GST నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెలకు రూ.20వేల కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల సిటీల్లో విద్య, ఉపాధి కోసం వచ్చిన వారికి ఊరట కల్గనుంది. ఇప్పటికే విద్యాసంస్థల హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

News June 22, 2024

సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా

image

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఈనెల 26న ఆమె, మరో వ్యోమగామి విల్‌మోర్‌ భూమిపైకి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో సమస్య తలెత్తడంతో తిరుగు ప్రయాణాన్ని NASA వాయిదా వేసింది. పరిస్థితులు అనుకూలిస్తే జులై 2న వారు భూమిపైకి రావొచ్చని అంచనా. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14నే వారు భూమిపైకి రావాల్సి ఉంది. కానీ వ్యోమనౌకలో హీలియం లీకేజీతో ఈనెల 26కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.