News June 22, 2024

66 ఏళ్లొచ్చినా అయ్యన్న ఫైర్ బ్రాండే: సీఎం చంద్రబాబు

image

AP: స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి CM చంద్రబాబు అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ BC నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉంది. NTR పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్‌లో ఆయన ఫైర్ బ్రాండే. గత ఐదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు’ అని కొనియాడారు.

News June 22, 2024

ఆ ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్

image

ఆఫీస్‌కు లేటుగా వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులు 9amకి కార్యాలయంలో ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్‌ను కలుపుకొని 9.15amలోపు ఆఫీస్‌లోని బయోమెట్రిక్‌లో హాజరు వేయకపోతే హాఫ్ డే CLలో కోత విధించనుంది. ఆఫీస్‌కి రాలేకపోతే ఒకరోజు ముందే సమాచారమివ్వాలని సూచించింది. దానికి CL వర్తిస్తుందని చెప్పింది.

News June 22, 2024

పక్షుల్ని కాపాడేందుకు దోమల్ని పంపుతున్నారు.. ఎందుకంటే?

image

హవాయి దీవుల్లో కనిపించే హనీక్రీపర్ పక్షులను కాపాడేందుకు అధికారులు మగదోమలను పంపుతున్నారు. అదేంటంటారా? దోమల ద్వారా సంక్రమించే ఏవియన్ మలేరియా బారిన పడి ఈ పక్షులు చనిపోతున్నాయట. ఇప్పటికే 33 జాతులు అంతరించిపోయాయి. దీంతో దోమల సంతానోత్పత్తిని నిరోధించే ఓల్బాచియా అనే బ్యాక్టీరియాను కలిగిన మగ దోమలను హెలికాప్టర్ల ద్వారా విడుదల చేస్తున్నారు. వీటితో కలిసిన ఆడ దోమలు గుడ్లను పొదగలేవు.

News June 22, 2024

ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా?

image

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రాక్షసుడిలా ఎంతో వైల్డ్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే హృతిక్ రోషన్ ‘వార్-2’ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నీల్ సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News June 22, 2024

నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా సహజ వాయువు, విమానయాన టర్బైన్ ఇంధనాన్ని GST పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలతో పాటు ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్నుపై సమీక్షించనున్నారు.

News June 22, 2024

రెండో రోజు అసెంబ్లీ.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

AP: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న అసెంబ్లీకి హాజరు కాలేని ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

News June 22, 2024

డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లేనట్లేనా?

image

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ కాలేదు. జులైలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కూటమి పార్టీల్లో ఎవరికి ఈ పదవి ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా ఇవాళ ఉదయం 11గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నియామకం తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది.

News June 22, 2024

డైలాగులు కాదు.. అసెంబ్లీకి వచ్చి పోరాడు:TDP

image

AP: వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయించారని ఆ పార్టీ చీఫ్ జగన్ చేసిన <<13487894>>ట్వీట్‌<<>>కు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా మత్స్యకారుల భూమిని ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ నీ ఆక్రమణలు వదిలేయమంటావా? ఇంత పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు’ అని జగన్‌ను ట్యాగ్ చేసింది.

News June 22, 2024

GOOD NEWS: తగ్గిన బంగారం ధరలు

image

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.72,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.66,350కి చేరింది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2,000 దిగి రూ.92,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

News June 22, 2024

పని చెప్పకుండా 20 ఏళ్లుగా జీతం చెల్లింపు.. కోర్టు మెట్లెక్కిన ఉద్యోగి

image

ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోబెట్టి జీతం ఇస్తామంటే ఎవరు కాదంటారు. ఫ్రాన్స్‌లోని టెలికాం దిగ్గజం ఆరెంజ్‌‌లో పనిచేసే లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్‌‌కు 20 ఏళ్లుగా ఎలాంటి పని చెప్పకుండా జీతం చెల్లిస్తున్నారు. అయితే పని చేయకుండా జీతం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె కంపెనీపై కేసు వేసింది. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆమెకు తగిన పని లేకపోవడంతో కంపెనీ ఇలా చేస్తోంది.