News June 22, 2024

పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు: ముద్రగడ కూతురు

image

AP: తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించని ఆయనకు పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్‌కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తోందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

News June 22, 2024

T20 WC: పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. PCB ఏమందంటే?

image

లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్‌ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను PCB వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసినవారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు PCB సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News June 22, 2024

వివేకా కేసులో అవినాశ్ అరెస్ట్ అవుతారు: ఆదినారాయణ రెడ్డి

image

AP: ఎన్నికల్లో YCP ఓటమికి చెల్లెలు షర్మిల కూడా కారణమని జగన్ గ్రహించారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో షర్మిలతో రాజీ చేయాలని తల్లి విజయమ్మను జగన్ కోరారని తెలిపారు. అయితే జగనే కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేశారని పేర్కొన్నారు. త్వరలో వివేకానందరెడ్డి హత్య కేసులో కడప MP అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలను BJPలో చేర్చుకునేందుకు పార్టీ సుముఖంగా లేదన్నారు.

News June 22, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఓఎంఆర్ షీట్లను ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని TGPSC ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ లాగిన్‌తో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా పేపర్ లీకేజీలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్ 9న నిర్వహించిన సంగతి తెలిసిందే.

News June 22, 2024

నిరుద్యోగి ఆత్మహత్య.. నాలుగేళ్లకు జాబ్ కాల్‌లెటర్

image

TG: మంచిర్యాల(D) మందమర్రికి చెందిన జీవన్‌కుమార్(24) 2018లో జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రాశారు. తర్వాత మిగులు పోస్టుల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా మెరిట్ ఆధారంగా భర్తీకి అధికారులు సిద్ధమయ్యారు. ఈక్రమంలో విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈనెల 24న రావాలంటూ జీవన్‌కు కాల్‌లెటర్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం రాకపోవడంతో అతడు 2020లోనే ఆత్మహత్య చేసుకున్నారు.

News June 22, 2024

మండిపోతున్న ధరలు!

image

ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో కూరగాయాలు, పాలు, తృణధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతేడాది కరవు, తీవ్ర వడగాల్పులు, వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోవడమే ఇందుకు కారణం. దీంతో గతేడాది నవంబర్ నుంచి దేశీయ వార్షిక ద్రవ్యోల్బణం 8శాతంగా ఉంది. ఇటు నైరుతి రుతుపవనాల గమనం క్షీణించడంతో లోటు వర్షపాతం నమోదైంది. ఇవి చురుగ్గా కదిలి జులై నుంచి వర్షాలు పడితే ఆగస్టు నాటికి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

News June 22, 2024

సాక్షిగా దస్తగిరి.. అభ్యంతరం లేదన్న సీబీఐ

image

AP: వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులకు రిమాండ్‌ను జులై 5 వరకు నాంపల్లి CBI కోర్టు పొడిగించింది. బెయిల్‌పై బయట ఉన్న శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. అయితే తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్‌పై నిందితుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే CBI మాత్రం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.

News June 22, 2024

రబీ కరవు నష్టంపై నివేదిక సిద్ధం

image

APలో 2023-24 రబీ సీజన్‌లో ఏర్పడిన కరవు పరిస్థితులపై కేంద్రం బృందం నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి అధ్యయనం చేసింది. కాగా రైతులను ఆదుకునేందుకు రూ.319.77 కోట్ల సహాయం కావాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేంద్ర బృందాన్ని కోరారు.

News June 22, 2024

టీ20ల్లో అరుదైన రికార్డు

image

దక్షిణాఫ్రికా ప్లేయర్ నోకియా టీ20ల్లో వరుసగా 16 ఇన్నింగ్సుల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. 2021-24 మధ్య కాలంలో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్రేమ్ స్వాన్(15 ఇన్నింగ్సులు), జంపా*(15 ఇన్నింగ్సులు), సోది(11 ఇన్నింగ్సులు) ఉన్నారు. మరోవైపు SA తరఫున T20 WC మ్యాచుల్లో అత్యధిక వికెట్లు(31) తీసిన బౌలర్‌గా నోకియా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో డేల్ స్టెయిన్(30) ఉన్నారు.

News June 22, 2024

ఇవాళ భారీ వర్షాలు

image

TG: ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే HYD సహా పలుచోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.