News June 21, 2024

PIC OF THE DAY.. అల్లుడిని ఆశీర్వదించిన బాలయ్య

image

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. MLAగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నారా లోకేశ్‌ను బాలయ్య ఆశీర్వదించారు. ప్రమాణ స్వీకారం చేసి వెళ్తుండగా.. అక్కడే ఉన్న లోకేశ్ వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా ఆయన్ను ఆశీర్వదించారు. తనకు కేటాయించిన శాఖల విధులను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలని అల్లుడికి సూచించారు. ‘PIC OF THE DAY’ అని నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

News June 21, 2024

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను వదిలేయాలి: ముద్రగడ

image

AP: పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు. ‘NTR సీఎం అయ్యాక సినిమాల్లో నటించడం పూర్తిగా మానేశారు. చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలియదు. మధ్యలో ఓ సినిమాలో నటించాల్సి వస్తే కేంద్రం నుంచో, సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకున్నారు. మీరు కూడా NTR తరహాలోనే సినిమాలు మానేసి ప్రజాసేవకు మీ జీవితాన్ని అంకితం చేయండి’ అని సూచించారు.

News June 21, 2024

చైనాలో త్వరలో ఏఐ అడల్ట్ డాల్స్!

image

Ai దాదాపు అన్ని రంగాల్లోనూ ఎంట్రీ ఇస్తోంది. చైనాలో అయితే దీనిని అడల్ట్ డాల్స్‌లోనూ వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడల్ట్ డాల్స్ తయారు చేసే స్టార్‌పెరీ టెక్నాలజీ అనే సంస్థ సొంతంగా ఓ ఏఐ మోడల్ డిజైన్ చేస్తోంది. డాల్స్ యూజర్లతో సులువుగా మాట్లాడగలిగి, భౌతికంగా ఇంటరాక్ట్ కాగలిగే విధంగా ఏఐని రూపొందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆగస్టులో ఈ మోడల్ ఓ కొలిక్కి రావొచ్చని తెలిపింది.

News June 21, 2024

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

image

TG: సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. <>https://hallticket.tspsc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో tspsc ID, డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 581 ఉద్యోగాలకు ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News June 21, 2024

BRS ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు.. రూ.300 కోట్ల అక్రమాలు జరిగాయన్న ఈడీ

image

TG: పటాన్‌చెరు BRS ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో సోదాలకు సంబంధించి ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారని తెలిపింది. డబ్బును స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని, పలువురు బినామీలుగా ఉన్నట్టు తేలిందని ED వివరించింది.

News June 21, 2024

రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని CBN నివాసంలో జరిగే ఈ సమావేశానికి 16 మంది ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతను ఆయన ఎంపిక చేయనున్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించే అవకాశం ఉంది.

News June 21, 2024

CSIR యూజీసీ-నెట్ వాయిదా: NTA

image

CSIR యూజీసీ-నెట్ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్లు NTA ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే పరీక్షలను లాజిస్టిక్ సమస్యలు, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు https://csirnet.nta.ac.in/ సైట్ చూడాలని సూచించింది.

News June 21, 2024

డయేరియాపై CS సమీక్ష.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రచారం

image

AP: రాష్ట్రంలో డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలుచేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఇందులో గ్రామవార్డు సచివాలయాల సిబ్బందిని, ANM అంగన్వాడీ సిబ్బందిని భాగం చేయాలన్నారు.

News June 21, 2024

పుణే యాక్సిడెంట్.. నిందితుడి తండ్రికి బెయిల్

image

పుణేలో కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందితుడి(17) తండ్రి విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరైంది. మే 19న మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపిన ఆ బాలుడు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతికి కారణమయ్యాడు. కాగా తమ కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు బ్లడ్ శాంపిల్స్ మార్చారనే కారణంతో తండ్రి విశాల్ అగర్వాల్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పుణేలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

News June 21, 2024

రేణుకాస్వామి కేసులో విస్తుపోయే విషయాలు

image

కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని టార్చర్ చేసి చంపడాన్ని నటి పవిత్ర గౌడ దగ్గరుండి వీక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్శన్‌కు క్లోజ్ ఫ్రెండైన పవిత్ర గురించి అసభ్యకరమైన పోస్ట్ చేయడంతో స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200km దూరంలోని ఓ షెడ్డులో బంధించి కర్రలతో కొట్టి, కరెంట్ షాక్‌ పెట్టారట. సాక్ష్యాలు చెరిపివేసేందుకు దర్శన్ మరో ఫ్రెండ్ దగ్గర రూ.40లక్షలు అప్పు చేశారని పేర్కొన్నారు.