India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్యసభ పక్షనేతగా కేంద్ర మంత్రి JP నడ్డాను బీజేపీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికానందున మరో 6-7 నెలలు అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనకు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్ విడుదల ఆలస్యం కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WorstBannerVyjayanthiFilms అంటూ Xలో పోస్టులు చేస్తున్నారు. తొలుత ఇవాళ రాత్రి 6 గంటలకు, ఆ తర్వాత రా.8కి రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ అప్డేట్ ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాగా ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అందమైన గోవా బీచ్‌లలో మద్యం తాగుతూ, చెత్తను పడేస్తున్న టూరిస్టుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో అక్కడ ‘కలంగుట్ బీచ్’ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘పర్యాటకులు ఇక్కడికి రావడానికి ముందు తప్పనిసరిగా హోటల్ రిజర్వేషన్లు చూపించాలి. ఇందుకోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. బీచ్‌లో ఆహార వ్యర్థాలు, మద్యం బాటిళ్లు, చెత్త పడేసిన వారిని గుర్తించి పన్ను వసూలు చేస్తాం’ అని సర్పంచ్ జోసెఫ్ వెల్లడించారు.
స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని YCP నిర్ణయించింది. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే జగన్ రేపు వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు. కాగా ‘జగన్ ఓడిపోయాడు కానీ <<13442979>>చావలేదు<<>>’ అని అయ్యన్నపాత్రుడు, ఓ వ్యక్తి 2 రోజుల క్రితం సంభాషించుకున్నారు. ఈ వ్యాఖ్యల వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
AP: సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా.. నువ్వెప్పుడూ ప్రజల హీరోవి. నిరంతరం ప్రజల గుండెల్లోనే ఉంటావు. వారిని సంతోషంగా ఉంచేందుకు శ్రమిస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్నా’ అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా హిందూపురం నుంచి MLAగా బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
TG: రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులు సింగరేణికి అప్పగించాలని గతంలో డిమాండ్ చేసిన CM రేవంత్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని KTR ప్రశ్నించారు. ‘సింగరేణి ప్రైవేటీకరణకు దారి తీసే బొగ్గు క్షేత్రాల వేలానికి మీరు అంగీకరించకుండానే వేలంపాట జరుగుతోందా? NDA ప్రభుత్వం గుజరాత్, ఒడిశాలోని గనులకు వేలం నుంచి మినహాయింపు ఇస్తే తెలంగాణకూ మినహాయింపు ఇవ్వమని మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు?’ అని ట్వీట్ చేశారు.
T20WCలో భాగంగా సౌతాఫ్రికాతో సూపర్8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు ఇందులోనూ గెలిచి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి.
SA: డికాక్, హెండ్రిక్స్, మార్క్రామ్(C), మిల్లర్, క్లాసెన్, స్టబ్స్, జాన్సెన్, మహరాజ్, రబాడ, నోర్జ్, బార్ట్‌మన్.
ENG: సాల్ట్, బట్లర్(C), బ్రూక్, బెయిర్‌స్టో, అలీ, లివింగ్‌స్టోన్, కర్రన్, ఆర్చర్, రషీద్, వుడ్, టోప్లీ.
వయనాడ్‌లో జరగనున్న ఉప ఎన్నికలో ఏఐసీసీ అగ్ర నేత ప్రియాంకా గాంధీ తరఫున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి తరఫున ఆమె ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లో ఎన్నిక జరపాలనే నిబంధన ఉంది. దీంతో త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.9తో రీఛార్జ్ చేసుకుంటే 10GB డేటా లభిస్తుంది. అయితే దీన్ని కేవలం గంటలోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ఫైల్, మూవీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్లలో 10GB డేటాకు రూ.100 వరకు చెల్లించాల్సి ఉంది.
TG: అర్హులందరికీ రైతుభరోసా అమలు చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘జాతీయ రహదారులకు, శ్రీమంతులకు రైతుభరోసా నిధులు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ సంక్షేమం సామాన్యులకు చేరాలి. ఇందుకోసం మంత్రులు భట్టి, తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటిల నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేశాం. జులై 15 కల్లా నివేదిక వస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతుభరోసా విధివిధానాలు నిర్ణయిస్తాం’ అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.