News June 21, 2024

త్వరలో హెల్త్ పాలసీ.. PHCల బలోపేతం: రాజనర్సింహ

image

TG: నూతన హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్ ఓపీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్య పథకాల అమల్లో ఇబ్బందులను గుర్తిస్తాం. PHCలను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం అన్ని చోట్లా ఇన్‌ఛార్జి పోస్టులే ఉన్నాయి. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News June 21, 2024

కలిసేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారా?: జగదీశ్ రెడ్డి

image

TG: అరెస్ట్ చేసిన BRS మాజీ MLA బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘BRS శ్రేణులు సీఎం కాన్వాయ్‌పై దాడి చేయలేదు. పోచారం ఇంటికి CM ఎందుకు వచ్చారో తెలుసుకునేందుకు వెళ్లారంతే. అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరితాడు వేయడమేనని జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.

News June 21, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600కుపైగా పాయింట్లు కోల్పోయి కనిష్ఠంగా 76,895కు చేరింది. ప్రస్తుతం 480 పాయింట్ల నష్టంతో 77029 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 23,390 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. 120 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం 23448 వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, L&T వంటి బడా షేర్లు నష్టాలు నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

News June 21, 2024

పెళ్లికి రావాలని అల్లు ఫ్యామిలీని ఆహ్వానించిన నటి వరలక్ష్మి

image

తమిళ నటి వరలక్ష్మి శరత్‍కుమార్, తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ని జూలై 2వ తేదీన వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి థాయ్‌లాండ్‌లో జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా ఈ జంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్‌ని కలిసి కుటుంబమంతా హాజరుకావాలని ఆహ్వానించింది.

News June 21, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

ఇటీవల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.810 పెరిగి రూ.73,250కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.67,150గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీకి రూ.1400 పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ రూ.98,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

News June 21, 2024

కల్తీ సారా.. మోగుతున్న మరణమృదంగం

image

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. కల్తీ నాటు సారా మృతుల సంఖ్య 47కి చేరినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News June 21, 2024

172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

AP: తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. సభ రేపు ఉదయం 10.30గంటలకు పున:ప్రారంభం కానుంది. మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.

News June 21, 2024

నెటిజన్‌పై శ్రుతి హాసన్ అసహనం

image

‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ ప్రశ్నించిన నెటిజన్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి వివక్షలు వద్దు. మీరు మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని అనడం మంచిది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటులు దక్షిణాది యాక్టర్లను చిన్న చూపు చూస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

News June 21, 2024

అందుకే బొగ్గు గనుల వేలం: కిషన్‌రెడ్డి

image

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మార్కెట్‌లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని, బొగ్గు అంటే నల్ల బంగారమని అభివర్ణించారు. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 21, 2024

అనారోగ్యం కారణంగానే MLA భార్య ఆత్మహత్య: పోలీసులు

image

TG: అనారోగ్యం కారణంగానే చొప్పదండి MLA సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మూడేళ్ల నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోందని, అది భరించలేక సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అల్వాల్ ఏసీపీ రాములు తెలిపారు. అఘాయిత్యానికి ముందు తన తల్లి, భర్తకు ఆమె ఇదే విషయాన్ని తెలియజేసినట్లు వెల్లడించారు. రూపాదేవి చనిపోయినప్పుడు తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు.