News June 19, 2024

బేబీ బంప్‌ ఫొటో రివీల్ చేసిన దీపిక

image

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు రివీల్ చేశారు. గత ఫిబ్రవరిలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన ఆమె తాజాగా బేబీ బంప్‌తో ఫొటో షూట్‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. 2018లో వివాహం చేసుకున్న దీపిక, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ వచ్చే సెప్టెంబర్‌లో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు.

News June 19, 2024

‘బేటీ పఢావో.. బేటీ బచావో’ రాయలేకపోయిన కేంద్ర మంత్రి

image

కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ‘బేటీ పఢావో, బేటీ బచావో’ నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మకుండిలో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై స్లోగన్‌ను సరిగ్గా రాయలేకపోయారు. అయితే, అఫిడవిట్‌లో ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.

News June 19, 2024

APలో IASల బదిలీ

image

*కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
*పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
*సివిల్ సప్లై కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
*CRDA కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
*ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
*పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
*ఉద్యాన, మత్స్య, సహకార కార్యదర్శిగా అహ్మద్ బాబు
*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్

News June 19, 2024

FLASH: APలో భారీగా IASల బదిలీ

image

ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్‌లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌లను నియమించింది.

News June 19, 2024

21న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు

image

నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లతో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. విద్యార్థులకు న్యాయం అందేలా చేసేందుకే ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కాగా నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

News June 19, 2024

ITI విద్యార్థులకు టాటా కంపెనీతో నైపుణ్య శిక్షణ: మంత్రి ఉత్తమ్

image

TG: తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా BRS ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐ కాలేజీలు ఉన్నాయని, టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. వారికి అప్రెంటీస్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని ఆయన వివరించారు.

News June 19, 2024

రైల్వే భద్రతా విభాగంలో 1.5లక్షల పోస్టులు ఖాళీ

image

రైల్వే భద్రతా విభాగంలో మంజూరైన పది లక్షల పోస్టులకు గాను 1.5లక్షలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. RTI దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇందులో లోకో పైలట్ 14,429, అసిస్టెంట్ డ్రైవర్ 4,337 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అలాగే రైల్వే భద్రతా ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య కాలంలో రూ.70 వేల కోట్లు, 2014-24 సంవత్సరాల్లో రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించినట్లు ఓ అధికారి చెప్పారు.

News June 19, 2024

టీమ్ఇండియాకు మరో టెన్షన్

image

T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజీకి సంబంధించిన మ్యాచ్ అంపైర్లను ICC ప్రకటించింది. అందులో రిచర్డ్ కెటిల్‌బరో ఉండటంతో టీమ్ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 24న జరిగే ఆస్ట్రేలియా VS ఇండియా మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఆయన వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఉన్న ప్రతి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతూ వస్తోంది. ఆయన అంపైరింగ్‌లో 2014 T20 WC, 2015 ODI WC, 2016 T20 WC, 2017 CT, 2019 ODI WCలోనూ ఇండియా ఓడిపోయింది.

News June 19, 2024

ఈ నెల వర్షపాతం అంతంతమాత్రమే: IMD

image

దేశవ్యాప్తంగా ఈ నెల పెద్దగా వర్షపాతం నమోదు కాకపోవచ్చని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. జూన్ నెల దీర్ఘకాల వర్షపాతం సగటు కంటే ఈ ఏడాది తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఓ మాదిరిగా ఉన్నా ఉత్తరాది, మధ్య భారత రాష్ట్రాలకు బాగా తక్కువ నమోదవుతుందని వెల్లడించింది. జూన్ సగటు వర్షపాతం 80.6mm కాగా ఈ నెలలో 20శాతానికిపైగా తగ్గి కేవలం 64.5mm వర్షపాతం నమోదైంది.

News June 19, 2024

ఈ నెల 21న కేబినెట్ భేటీ

image

TG: ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లపై కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం.