News June 18, 2024

BREAKING: ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ మెయిల్స్

image

దేశవ్యాప్తంగా 40 ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు మెయిల్స్ చేశారు. ఢిల్లీ, పట్నా, జైపూర్, వడోదరా, కోయంబత్తూర్ తదితర విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 18, 2024

చనిపోతూ ఆరుగురి ప్రాణాలు కాపాడాడు

image

తమ కొడుకు చనిపోయినప్పటికీ మరో ఆరుగురిలో జీవించి ఉంటారనే ఉద్దేశంతో ముష్టిపల్లి శ్రీనివాస్ కుటుంబం అవయవదానం చేసేందుకు ముందుకొచ్చింది. అతని రెండు కిడ్నీలు, లివర్, గుండె, 2 కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మనిచ్చారని తెలంగాణ జీవన్‌దాన్ Xలో పోస్ట్ చేసింది. శ్రీనివాస్ ఈనెల 14న మరణించినట్లు వెల్లడించింది.

News June 18, 2024

‘గేమ్ ఛేంజర్‌’ కోసం రెండు తేదీలు లాక్?

image

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31 లేదా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

News June 18, 2024

TG PGECET ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

image

TG: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన PGECET ఫలితాలు విడుదలయ్యాయి. Way2News యాప్‌లో సులభంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.

News June 18, 2024

T20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ కలకలం!

image

T20 WCలో ఫిక్సింగ్ కలకలం రేగింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని ఓ ఉగాండా ప్లేయర్ ICCకి ఫిర్యాదు చేశారు. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పదే పదే ఫోన్లు చేసినట్లు ఆయన ఐసీసీకి సమాచారమిచ్చారు. దీనిపై ICC యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా T20 WCకు ఉగాండా అర్హత సాధించడం ఇదే తొలిసారి. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచింది.

News June 18, 2024

మీరు గెలిస్తే EVMలు మంచివి.. లేదంటే చెడ్డవా?: లోకేశ్

image

AP: మీరు 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, కానీ 2024లో ఓడిపోతే అవి చెడ్డవా అని మాజీ సీఎం జగన్‌ను మంత్రి నారా లోకేశ్ నిలదీశారు. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. ‘ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్ ఎప్పుడు తిరిగిస్తున్నారు. రూ.560 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? వీటిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం కావాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

News June 18, 2024

ఈ నెల 20 నుంచి 24 వరకు రీవెరిఫికేషన్‌కు ఛాన్స్

image

ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ <<13462523>>ఫలితాల్లో<<>> 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవెరిఫికేషన్‌కు ఈ నెల 20 నుంచి 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 18, 2024

రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది: భువనేశ్వరి

image

AP: రాష్ట్రంలో హింసాత్మక పాలన పోయి ప్రజాపాలన మొదలైందని CM చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్న సంతోషంలో ఉన్నారని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశా. వారి బాధలు విని, సమస్యలు తెలుసుకున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది. ఇకపై రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది’ అని ఆమె పేర్కొన్నారు.

News June 18, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301కు చేరగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిసింది. పవర్‌గ్రిడ్, విప్రో, ICICI బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రక్షణ రంగంలో ఎగుమతులను 2029కి ₹50వేలకోట్లకు పెంచాలని కేంద్రం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఢిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లాయి. గరిష్ఠంగా పరాస్ ఢిఫెన్స్ 20% లాభాన్ని రికార్డ్ చేసింది.

News June 18, 2024

అఫ్గాన్‌తో మ్యాచ్‌కు జైస్వాల్, కుల్దీప్ ఎంట్రీ?

image

T20WCలో అఫ్గాన్‌తో సూపర్‌8 మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కుల్దీప్ జట్టులో చేరే అవకాశం ఉంది. జైస్వాల్‌ను రోహిత్‌తో ఓపెనింగ్‌లో దింపే ఛాన్స్ ఉంది. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే నేపథ్యంలో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకొని అర్ష్‌దీప్ సింగ్‌కు రెస్ట్ ఇవ్వనున్నారట. ఓపెనర్‌గా ఇటీవల విఫలమవుతున్న కోహ్లీ వన్‌డౌన్‌లో రావొచ్చు. అయితే జైస్వాల్ కోసం అక్షర్ బెర్త్ కోల్పోవాల్సి ఉంటుందని టాక్ విన్పిస్తోంది.