India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై బిహార్ GOVT ఏర్పాటు చేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మే 4న మాకు ప్రశ్నపత్రం అందింది. పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి రూ.30లక్షల చొప్పున వసూలు చేశాం’ అని ఇద్దరు నిందితులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు. ఇందులో 13 మంది నీట్ అభ్యర్థులు భాగస్వామ్యం కాగా ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు.
వెస్టిండీస్ వేదికగా జరగబోయే సూపర్-8 ఫైట్‌లో భారత్ మూడు జట్లతో తలపడనుంది. వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలుపొందినా సెమీస్ బెర్తు దక్కనుంది. సూపర్-8లో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న అఫ్గాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. సూపర్-8లో చివరగా జూన్ 24న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లు బార్బొడోస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియాలో జరగనున్నాయి.
AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు ఎంతవరకు పూర్తైంది? గత ఐదేళ్లలో నిర్మాణం జరిగిన తీరు సహా పలు అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చిస్తారు.
AP: వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్‌పై <<13446774>>టీడీపీ<<>> నీతిమాలిన రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ మండిపడింది. ‘ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్‌కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ వస్తువులకు ఖరీదుకట్టాలని వైసీపీ కార్యాలయ సిబ్బంది 9-10 రోజుల క్రితమే అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే టీడీపీ, మంత్రులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అంటూ ట్వీట్ చేసింది.
‘ది జంగిల్ బుక్’లోని ప్రధాన పాత్ర మోగ్లీకి ‘దినా సానిచార్’ అనే వ్యక్తే ఆదర్శం. 1867లో UP బులంద్‌షహర్ అడవుల్లోని గుహ వద్ద వేటగాళ్లకు తోడేళ్లతో కలిసి పెరుగుతున్న అతడు(6) కనిపించాడు. అనాథాశ్రమానికి తీసుకెళ్లి మాటలు నేర్పించే ప్రయత్నం చేశారు. పచ్చి మాంసం తినడానికి ఇష్టపడేవాడు. కాళ్లపై నిలబడలేకపోయేవాడు. తోడేళ్ల మాదిరి అరిచేవాడు. దంతాలను పదును పెట్టేందుకు ఎముకలు కొరికేవాడు. 1895లో క్షయతో చనిపోయాడు.
టీ20 వరల్డ్ కప్‌లో టీం ఇండియా ఆఖరి లీగ్ మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దైంది. మ్యాచ్‌కు ముందు వర్షం పడగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో టాస్ కూడా వేయలేకపోయారు. రెండు సార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్-ఏ నుంచి ఇండియాతో పాటు యూఎస్ఏ కూడా సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(EVM)ను రద్దు చేయాలని టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. AI లేదా మానవులు వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ద్వారా ప్యూర్టోరికో దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై మస్క్ ఈ విధంగా స్పందించారు. కాగా మనదేశంలోనూ పలు రాజకీయ పార్టీలు EVMలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ తిరిగి మరో రెండేళ్లలో జరగనుంది. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక ఆటోమేటిక్‌గా క్వాలిఫై అవుతాయి. ఇక ఈ ఏడాది టోర్నీలో సూపర్ 8కు చేరుకున్న జట్లన్నింటికీ 2026 వరల్డ్ కప్ అర్హత లభిస్తుంది. లీగ్ దశలోనే నిష్క్రమించిన పాక్, న్యూజిలాండ్ వంటి జట్ల క్వాలిఫికేషన్ మాత్రం వాటి ర్యాంకులపై ఆధారపడి ఉంటుంది. నేరుగా అర్హత సాధించని జట్లు క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.