India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: చలనచిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. సినిమాలపై ఇక ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొన్నారు. ఏపీని టూరిజం హబ్‌గా మారుస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన.. వారందరిపైనా చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈవీఎంలపై సీఎం జగన్, వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
NDA కూటమిలో చంద్రబాబు కీలకంగా మారడంతో CBN&APకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ స్టాక్‌మార్కెట్‌లో అదరగొడుతున్నాయి. PSU, మోదీ స్టాక్స్ దూసుకెళుతున్నా CBN&AP స్టాక్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా అంజనీ ఫుడ్స్, క్రేన్ ఇన్‌ఫ్రా, హెరిటేజ్ ఫుడ్స్ వంటి స్టాక్స్‌లో ట్రేడర్లు బాబు విజయాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి 24 షేర్ల విలువ 8 ట్రేడింగ్ సెషన్స్‌లోనే రూ.20వేల కోట్లు పెరిగింది.
AP: ఆగస్టు 1 నుంచి గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు వైద్యశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఇందుకోసం 20వేల మందికి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి టెస్టుల కోసం వైద్య కళాశాలలు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి WHO భాగస్వామ్యంతో టెస్టులు చేస్తారు.
AP: ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయింది. పవన్ కళ్యాణ్‌కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితోపాటు మరో 3మంత్రిత్వ శాఖలు దక్కాయి. ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత మరింత పెరిగింది. దీంతో ఆయన సినిమాలకు దూరమవుతారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలున్నాయి. వీటి తర్వాత పవన్ వెండితెరపై సందడి చేస్తారా? లేదా ప్రజాక్షేత్రంలోనే సేవలందిస్తారా? అనేది చూడాలి.
TG: నారాయణపేట్ జిల్లా ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులను ఎస్పీ యోగేశ్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించకపోవడంతో ఎస్సైపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉట్కూరు మండలం చిన్నపొర్లలో భూతగాదాలతో సంజీవ్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు కొట్టి <<13438774>>చంపారు<<>>. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు.
AP: టీటీడీ ఈవో ధర్మారెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జె.శ్యామలరావుని నియమించింది. ఈయన ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ధర్మారెడ్డిని సెలవుపై పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను ధర్మారెడ్డి ఎదుర్కొంటున్నారు.
AP: పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్‌కు రావాలని ఆయన సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే CM అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.
T20WCలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకు 3 మ్యాచులు ఆడగా అతడి గణాంకాలు(రన్స్ 0, వికెట్లు 0, క్యాచ్‌లు 0) పేలవంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్ అయ్యారు. గత మ్యాచ్‌లో బౌలింగే వేయలేదు. దీంతో అతడి స్థానంలో జైస్వాల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అతడు మంచి ఓపెనింగ్ ఇస్తారని, కోహ్లీని వన్‌డౌన్‌లో దించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
AP: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి ఉద్యోగాల కల్పనలో ఏపీ ఇతర రాష్ట్రాలకు పోటీ ఇస్తుందని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను రాష్ట్రానికి తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు. ఇందుకోసం 2019లో వదిలిపెట్టిన చోటు నుంచే తిరిగి పనులు ప్రారంభిస్తానని పేర్కొన్నారు.
TG: బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సిరిసిల్ల ఆర్‌వోకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.