News June 11, 2024

దూకుడు పెంచితే బందీలను కాల్చేయండి: హమాస్

image

ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచితే బందీలను చంపేయాలని హమాస్ నాయకత్వం ఫైటర్లను ఆదేశించింది. ఇటీవలే వీరి నుంచి నలుగురు బందీలను IDF రక్షించింది. ఈ క్రమంలో తమ సిబ్బంది, పాలస్తీనా పౌరులు మరణించారని ఆరోపిస్తూ ఉగ్ర సంస్థ ఈ ప్రకటన చేసింది. 2023 OCT 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందిని హమాస్ బంధించింది. వీరిని వేర్వేరు చోట్లకు తరలిస్తున్నట్లు డ్రోన్లు, శాటిలైట్లతో ఇజ్రాయెల్, USA సంయుక్త బృందం గమనిస్తోంది.

News June 11, 2024

జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్

image

AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.

News June 11, 2024

పెళ్లి గురించి సోనాక్షి చెప్పనేలేదు: శత్రుఘ్న సిన్హా

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. వివాహ విషయం ఆమె తనకు ఇంకా చెప్పలేదన్నారు. తన కూతురు సరైన నిర్ణయమే తీసుకుంటుందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన భార్య సంతోషంగా ఆశీర్వదిస్తామని శత్రుఘ్న తెలిపారు. కాగా ఈనెల 23న జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

News June 11, 2024

ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్

image

పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు. భార్య రితికా, కూతురు సమైరాతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ రేపు యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.

News June 11, 2024

1,08,273 మంది వాలంటీర్ల పరిస్థితేంటి?

image

AP: ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. YCP అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ YCP అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.

News June 11, 2024

కొత్త బీర్లు ఇప్పట్లో లేనట్లే!?

image

TG: ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కొత్త కంపెనీలు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పర్మిషన్లకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

News June 11, 2024

ఏపీకి అర్బన్ డెవలప్‌మెంట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయం!

image

NDAలో కీలకమైన టీడీపీకి ప్రాధాన్యమైన శాఖలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్గిన విమానయాన శాఖ కేటాయించినా ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ ఇస్తే అమరావతి అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి పదవుల కన్నా కేంద్రనిధులపైనే టీడీపీ ఫోకస్ పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

News June 11, 2024

17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

image

AP: కొత్తగా ఎన్నికైన MLAలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

News June 11, 2024

లాహోర్‌లో ఆడండి.. భారత్‌కు PCB విన్నపం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా భారత్ తమ అన్ని మ్యాచ్‌లు ఆడాలని PCB కోరింది. ఈ మైదానాన్ని హోంగ్రౌండ్‌గా చేసుకుని ఆడాలని విజ్ఞప్తి చేసింది. ఆ జట్టుకు ఇక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పాక్ వినతిపై BCCI ఇంకా స్పందించనట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడాలని భారత్ భావిస్తోంది.

News June 11, 2024

చంద్రబాబు రెండో సంతకం దానిపైనే..

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం CM హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని TDP ప్రకటించింది.