News June 11, 2024
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్

AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.
Similar News
News March 22, 2025
బయట తినాలంటేనే భయమేస్తోంది

TG: ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫుడ్ లవర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న దాడుల్లో కుళ్లిన మాంసం లభించగా, కిచెన్ శుభ్రంగా లేదని, కూరగాయలు సరిగ్గా నిల్వ చేయట్లేదని సోదాల్లో తేల్చారు. దీంతో ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2025
రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలు మినహా గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని లేకపోతే లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.
News March 22, 2025
నీటి ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. 28 రోజుల కింద టన్నెల్‌లో 8 మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహాన్ని ఇటీవల వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.