News June 11, 2024

‘NOKIA 3210’ మళ్లీ వచ్చేసింది..

image

మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. HMD గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.

News June 11, 2024

మహిళలకు ఫ్రీ బస్సు.. APలోనూ TG విధానమే?

image

తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు తీరును APSRTC అధికారులు పరిశీలించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. TGలో అనుసరిస్తున్న విధానమే APకి సరిపోతుందని భావిస్తున్నారట. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధికి ఇస్తారా? లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అనేది NDA ప్రభుత్వం నిర్ణయించనుంది. ఈ పథకం అమలుతో RTCకి నెలకు రూ.200 కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా.

News June 11, 2024

మంత్రివర్గంలో గుంటూరు జిల్లాకు పెద్దపీట?

image

AP: చంద్రబాబు మంత్రివర్గంలో గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 3 నుంచి 4 మంత్రి పదవులు ఈ జిల్లాకు దక్కనున్నట్లు సమాచారం. అలాగే BCలకు 8, SCలకు 2, STలకు 1, మైనారిటీలకు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వాటిని కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య సామాజికవర్గాలకు కేటాయించనున్నారు. ఇందులో జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

News June 11, 2024

‘బౌలర్లు మ్యాచులు గెలిపిస్తారు’.. స్టెయిన్ ట్వీట్ నిజమైందిగా!!

image

సౌతాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ 2021లో చేసిన ట్వీట్ నిజమైంది. ‘బ్యాటర్లు ప్రేక్షకులను అలరిస్తారు. బౌలర్లు మ్యాచులు గెలిపిస్తారు’ అని స్టెయిన్ 2021లో ట్వీట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే యార్కర్ కింగ్ బుమ్రా.. మొన్న PAKపై అద్భుతంగా రాణించి భారత జట్టును గెలిపించారు. గెలుపు అసాధ్యమనుకున్న అంచనాలను తలకిందులు చేసి మరపురాని విజయాన్ని అందించారు.

News June 11, 2024

రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

image

TG: మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను రేపు అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,36,487 మంది(83 శాతం) హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

News June 11, 2024

పింఛన్ల పెంపుపై కసరత్తు.. 1న రూ.4,400 కోట్లు ఖర్చు!

image

AP: ఎన్నికల్లో NDA ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.1,939 కోట్లు ఖర్చవుతోంది. ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ అమలు చేస్తే జులై 1న వృద్ధులు, వితంతువులకు రూ.7వేలు, దివ్యాంగులకు రూ.6వేల చొప్పున ఇవ్వడానికి రూ.4,400 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఆగస్టు నుంచి నెలకు రూ.2,800 కోట్ల వ్యయమవుతుందని లెక్కగట్టారు.

News June 11, 2024

BIG ALERT: ఇవాళ భారీ వర్షాలు

image

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ TGలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. APలోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News June 11, 2024

ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలకు చంద్రబాబు

image

AP: సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బాలకృష్ణ తదితరులు రాత్రికి అక్కడే బస చేసి 13న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత CBN తొలిసారి తిరుమలకు రానుండటంతో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

News June 11, 2024

నేడు EAPCET ఫలితాలు

image

AP: నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్&ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. WAY2NEWSలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా రిజల్ట్స్ చూసుకోవచ్చు.

News June 11, 2024

1, 2, 3, 4.. సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విజయాలు

image

T20WCలో థ్రిల్లింగ్ విక్టరీలు సాధించడం సౌతాఫ్రికాకు పరిపాటిగా మారింది. 5 పరుగుల కంటే తక్కువ మార్జిన్లతో ఆ జట్టు నాలుగుసార్లు గెలిచింది. 2009లో న్యూజిలాండ్‌పై ఒక రన్, 2014లో అదే జట్టుపై 2, అదే ఏడాది ఇంగ్లండ్‌పై 3, ఈసారి బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో ప్రొటీస్ <<13417885>>విజయం<<>> సాధించింది. మరే ఇతర జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.