News June 7, 2024

సెన్సెక్స్ ALL TIME HIGH

image

కౌంటింగ్ రోజున దారుణ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 రోజులు పైకెగిశాయి. ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 1,620 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 76,795కు చేరింది. చివరకు 76,694 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగసి 23,267 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్లు లాభపడ్డారు. రెపో రేట్లలో <<13395338>>RBI<<>> మార్పులు చేయకపోవడం, మోదీ 3.Oకు చేరువవడం మార్కెట్లకు కలిసి వచ్చినట్లు నిపుణుల అంచనా.

News June 7, 2024

T20WC: వసతులపై లంక అసంతృప్తి.. ICCకి ఫిర్యాదు

image

టీ20 వరల్డ్‌కప్‌లో తమపై వివక్ష చూపుతున్నారని శ్రీలంక క్రికెట్ ICCకి ఫిర్యాదు చేసింది. సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఒక్కో జట్టును ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించింది. 4 మ్యాచ్‌లు 4 వేదికల్లో ఉండటం వల్ల ప్రయాణానికే సమయం సరిపోతోందని వాపోయింది. హోటల్ దూరంగా ఉండడంతో ప్రాక్టీస్‌ గ్రౌండ్‌కు వెళ్లలేకపోతున్నామని పేర్కొంది. తమకు న్యాయం చేయాలని కోరింది.

News June 7, 2024

టీచర్ల బదిలీల కోసం లంచాలు తీసుకోలేదు: బొత్స

image

AP: ఉపాధ్యాయ బదిలీల కోసం తాను లంచాలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం, అగత్యం తనకు లేదన్నారు. ‘టీచర్ల బదిలీలు నిలిపేయాల్సిందిగా నేనే అధికారులకు విజ్ఞప్తి చేశా. బదిలీల్లో అవకతవకలు జరిగాయనేది అవాస్తవం. కొత్త ప్రభుత్వం టీచర్ల బదిలీలపై నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

News June 7, 2024

TDP ఎంపీలతో చంద్రబాబు

image

కొత్తగా ఎన్నికైన TDP ఎంపీలతో చంద్రబాబు ఢిల్లీలో ఫొటో దిగారు. అందులో పెమ్మసాని (GNT), అప్పలనాయుడు (VZM), వేమిరెడ్డి (నెల్లూరు), మహేశ్ యాదవ్ (ఏలూరు), ప్రసాదరావు (చిత్తూరు), మాగుంట (ఒంగోలు), నాగరాజు (కర్నూలు), శబరి (నంద్యాల), లక్ష్మీనారాయణ (ATP), పార్థసారథి (హిందూపురం), రామ్మోహన్(SKLM), హరీశ్ (అమలాపురం), కేశినేని చిన్ని (విజయవాడ), కృష్ణప్రసాద్ (బాపట్ల), కృష్ణదేవరాయలు (NRT), భరత్ (విశాఖ) ఉన్నారు.

News June 7, 2024

ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

image

AP:అఖండ మెజార్టీతో విజయం సాధించిన NDA కూటమి గత ప్రభుత్వంలో నియమించబడిన వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹10వేల వేతనం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు. రాజీనామా చేసిన వారు పోను 2లక్షల మంది వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తారా? కొత్తగా నియమిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

News June 7, 2024

ఈనెల 14న ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న‘కన్నప్ప’ సినిమా టీజర్ ఈనెల 14న రిలీజ్ కానుంది. కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, దీనిని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా తన హృదయంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

News June 7, 2024

సీఎంవోలోని పూనం, ముత్యాలరాజు, గుప్తాల బదిలీ

image

AP: ఏపీ సీఎం పేషీలోని ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్ భరత్ గుప్తాలను బదిలీ చేసింది. ఈ ముగ్గురు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎంవోలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 7, 2024

4 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు.. భారీ వర్ష సూచన

image

TG: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవి నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News June 7, 2024

వన్డే చరిత్రలో స్లోయెస్ట్ ఇన్నింగ్స్.. 174 బంతుల్లో 36 రన్స్!

image

వన్డే చరిత్రలో స్లోయెస్ట్ ఇన్నింగ్స్ సరిగ్గా ఇదే రోజు 1975లో నమోదైంది. ENGపై గెలిచేందుకు 335 రన్స్ చేయాల్సి ఉండగా.. సునీల్ గవాస్కర్ టెస్ట్ తరహాలో ఆడారు. 174 బంతుల్లో ఒక్క ఫోర్ కొట్టి కేవలం 36 పరుగులు చేశారు. దీంతో భారత్ 60 ఓవర్లలో 133/2 రన్స్ మాత్రమే చేయడంతో ENG 202 పరుగుల తేడాతో గెలిచింది. గవాస్కర్ ఇన్నింగ్స్‌ కోపం తెప్పించడంతో కొందరు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చారు.

News June 7, 2024

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు MLA కీలక నిర్ణయం!

image

TG: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ సిద్ధమయ్యారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. నీటి ఎద్దడి, మురుగు నీటి కాలువలు, రోడ్డు, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యల, పోడు భూముల గురించి కాల్స్ వచ్చినట్లు ఆయన Xలో పోస్ట్ చేశారు.