News June 5, 2024

మళ్లీ ఐటీ మంత్రిగా నారా లోకేశ్!

image

AP: నారా లోకేశ్ మంత్రి పదవిపై చర్చ జరుగుతోంది. గత TDP ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా IT అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయించారు. స్కిల్ హబ్ సెంటర్ ద్వారా యువతకు అక్కడే శిక్షణ ఇప్పించారు. గన్నవరానికి HCL వంటి దిగ్గజ ఐటీ కంపెనీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈసారి అదే శాఖ తీసుకుంటారా? మరేదైనా కీలక శాఖ బాధ్యతలు చేపడతారా? అనేది ఆసక్తిగా మారింది.

News June 5, 2024

ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

image

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందినవారు.

News June 5, 2024

లక్ష మెజారిటీతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి

image

మహారాష్ట్ర సాంగ్లీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ INDIA కూటమిలోని శివసేన (UBT) ఏకపక్షంగా తన అభ్యర్థిని నిలబెట్టింది. ఆ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే రెజ్లర్ చంద్రహార్‌‌కు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విశాల్ పాటిల్ 1 లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా చంద్రహార్‌‌ నిల్చోగా అతనికి కేవలం 60+వేల ఓట్లే వచ్చాయి.

News June 5, 2024

రాజకీయాల్లో గెలుపోటములు భాగం: మోదీ

image

రెండోసారి అధికారం ముగింపు సందర్భంగా నిర్వహించిన చివరి కేబినెట్ భేటీలో మంత్రులతో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు భాగమేనని, నంబర్స్ గేమ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇన్నాళ్లు ప్రజలకు మంచి చేసిన మనం.. ఇకపైనా కొనసాగిద్దామన్నారు. 2019తో పోలిస్తే ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 5, 2024

బీజేపీ సర్కార్ కాదు.. ఎన్డీయే సర్కార్!

image

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు బీజేపీ 32 సీట్ల దూరంలో ఉండటంతో కాషాయ పార్టీకి తలనొప్పి మొదలైంది. కచ్చితంగా ఎన్డీయే కూటమిలోని పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అది ఎన్డీయే సర్కారుగా అవతరించనుంది. కానీ గత రెండు ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో బీజేపీ/మోదీ సర్కారు అని సంబోధించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.

News June 5, 2024

BJPతో BRS లోపాయికారీ ఒప్పందం: అసదుద్దీన్

image

TG: పార్లమెంటు ఎన్నికల్లో BRS.. BJPకి మద్దతు ఇచ్చిందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అందుకే MP ఎన్నికల్లో BRS దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. ‘BRS 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణం. ఆ పార్టీ ఇలా ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే BJPకి మద్దతు పలికారు. ఇదొక తప్పుడు వ్యూహం’ అని ఒవైసీ పేర్కొన్నారు.

News June 5, 2024

బీజేపీకి రాముడు గుణపాఠం చెప్పాడు: సీఎం రేవంత్

image

TG: రాముడి పేరు మీద ఓట్లు యాచించిన బీజేపీని రాముడు కూడా క్షమించలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ‘రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలనుకున్న బీజేపీని ప్రజలు ఓడగొట్టారు. ఆ పార్టీ నేతలకు రాముడు గుణపాఠం చెప్పాడు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

News June 5, 2024

ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టొచ్చా?

image

మొత్తం లోక్‌సభ స్థానాలు 543. మేజిక్ ఫిగర్ 272. BJP నేతృత్వంలోని NDAకు 292 సీట్లతో స్పష్టమైన మెజార్టీ ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని INDIAకు 234 సీట్లున్నాయి. ఇతరులు 17చోట్ల గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే NDA కూటమిలోని TDP(16), JDU(12) ఇటువైపు రావాలి. అప్పుడు INDIA మెజార్టీ 262కు పెరుగుతుంది. ఇతరుల్లోని YCP-4, MIM-1తో పాటు మరో ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తే INC అధికారం చేపట్టే అవకాశం ఉంది.

News June 5, 2024

పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు: వెంకీ మామ

image

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని పొందిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విక్టరీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయాన్ని పొందిన ప్రియమైన పవన్‌కి అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ప్రజలకు సేవ చేయాలనే నీ కృషి, అంకితభావాన్ని కొనసాగించండి. పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 5, 2024

ఈరోజే రాష్ట్రపతిని కలవనున్న NDA నేతలు!

image

NDA నేతలు ఈరోజే రాష్ట్రపతి ముర్మును కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు రాష్ట్రపతిని కోరనున్నారట. మోదీ, నడ్డా, రాజ్‌నాథ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాస్వాన్, మాంఝీ తదితరులు కలవనున్నట్లు సమాచారం.