India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్‌న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.
బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్సకు అవసరమైన డబ్బులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బలగం క్లైమాక్స్‌లో ఈ దంపతులు పాడిన పాట అందరి గుండెలను పిండేసింది.
ప్రజల్లోకి నేతలు వెళ్లకపోవడం తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం సంక్షేమమే కాదు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పట్టించుకోవాలని చెబుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని, జనం సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను ఇదే కారణంతో ప్రజలు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఏపీలో కూటమి విజయానికి కూటమి పార్టీల మధ్య ఐక్యతే కారణమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. APలో ఓట్లే లేని BJPకి సీట్లు రావడానికి ఈ ఐక్యతే కారణమని వ్యాఖ్యానించారు. ఇదే లోపించి తెలంగాణలో కాంగ్రెస్‌కు MP సీట్లు తగ్గాయని చెప్పారు. సీట్లు, ఓట్లు లేవని పార్టీలను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధించలేదని.. ఈ విషయంలో డీఎంకే స్టాలిన్‌ను కాంగ్రెస్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
‘మేం NDAతోనే ఉంటాం’ అన్న చంద్రబాబు మాటలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. మరోసారి బలమైన మోదీ ప్రభుత్వాన్ని చాలామంది ఆశించారు. అంచనాలు తప్పి BJPకి 240 సీట్లే రావడం, బాబు, నితీశ్‌పై సందేహాలతో మార్కెట్లు క్రాష్ అయ్యాయి. నేటి ఉదయం ప్రెస్‌మీట్లో NDAకు చంద్రబాబు జైకొట్టడంతో పాజిటివ్ సెంటిమెంటుతో సూచీలు పెరిగాయని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాశ్ గోరక్షకర్ అన్నారు. దీనిపై మీ స్పందనేంటి?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అమెరికా తటస్థ వైఖరి ప్రదర్శించింది. విజేతలు, పరాజితులపై మాట్లాడబోమని తెలిపింది. ‘అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించినందుకు భారత ప్రభుత్వం, ప్రజలకు అభినందనలు. ఆరు వారాల్లో వివిధ దశల్లో ఓటింగ్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ విన్నర్స్, లూజర్స్ గురించి మేం స్పందించం. ఇక్కడా అంతే’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.
AP: గతంలో ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ పేరు వినిపించేంది. ఇప్పుడు పల్నాడు పేరు మారుమోగుతోంది. ఈ ప్రాంతం చాన్నాళ్లు ప్రశాంతంగానే ఉన్నా.. ఐదేళ్లలో ఫ్యాక్షన్ పడగ విప్పింది. పార్టీలు, ఆధిపత్య పోరులో కుత్తుకలు తెగాయి. TDP కార్యకర్త చంద్రయ్యను నడిరోడ్డుపై చంపిన తీరు చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది. పోలింగ్ రోజున చెలరేగిన హింసను చూసి దేశం నివ్వెరపోయింది. మరి కొత్త ప్రభుత్వంలోనైనా పల్నాడు చల్లబడుతుందేమో చూడాలి.
ఓటమి తర్వాత ‘హౌ ఈజ్ ద జోష్ అంటే హై సర్’ అనే అంటానని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. అమేథీలో కేఎల్ శర్మ ఆమెపై 1.6 లక్షల ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ‘జీవితమంటే ఇంతే. పదేళ్లలో గ్రామగ్రామాన తిరిగాను. రోడ్లు, కాలువలు, బైపాస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇళ్లు కట్టించాను. ఏదేమైనా గెలుపు, ఓటముల్లో నాకు అండగా ఉన్న అందరికీ రుణపడి ఉంటాను. వేడుకలు చేసుకుంటున్న వారికి అభినందనలు’ అని ఆమె అన్నారు.
ఒడిశాలో తొలిసారిగా అధికారం చేపట్టనున్న BJP నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు CM రేసులో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరమ్, పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజయంత్ పాండా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం గమనార్హం. దీంతో అధిష్ఠానం ఎవరికి అధికారం కట్టబెడుతుందో త్వరలోనే స్పష్టత రానుంది.
ప్రధాని మోదీ 400 సీట్లు గెలుచుకోవాలనుకున్న కోరిక నెరవేరలేదు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఇది సాధ్యమైంది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఆ పార్టీ 48.12శాతం ఓట్లు పొందింది. సీపీఐ 22 సీట్లు సాధించి 5.71శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 7.4శాతం ఓట్లతో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.