News June 5, 2024

ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయల్దేరారు. మోదీ నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశంలో వీరిద్దరు పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. మరోవైపు అమరావతిలో జరిగే తన ప్రమాణస్వీకారానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

News June 5, 2024

మీసం మెలేసిన అచ్చెన్నాయుడు

image

AP: శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు NDA కూటమిలో జోష్ నింపింది. ఉమ్మడి సిక్కోలులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, ఒక MP స్థానంలోనూ కూటమి అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైన TDP ఈసారి కూటమిగా క్లీన్ స్వీప్ చేసింది. ఫలితాలతో TDP, BJP,జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీసం మెలేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

News June 5, 2024

నీలిరంగు చీమలను చూశారా?

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో నీలిరంగు చీమలను సైంటిస్టులు కనుగొన్నారు. బెంగళూరుకు చెందిన ‘అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్‌’కు చెందిన కీటక శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. వీటికి ‘పరాపరాత్రెచీనా’ అని నామకరణం చేశారు. ఈ చీమల కాళ్లు మినహా శరీరం మొత్తం నీలిగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న16,724 చీమ జాతుల్లో ఈ నీలి చీమలు చాలా అరుదైనవి.

News June 5, 2024

25ఏళ్లకే నలుగురు ఎంపీలుగా ఎన్నిక

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు 25ఏళ్లకే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరీ సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి LJP అభ్యర్థిగా గెలుపొందగా, మరొకరు రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజనా జాతవ్, ఎస్పీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ కౌశంబి పార్లమెంట్ స్థానంలో గెలుపొందారు. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా గెలుపొందారు.

News June 5, 2024

జగన్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

image

తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది. దీనిపై విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.

News June 5, 2024

ఆ నలుగురి మెజారిటీ లక్ష లోపే..

image

ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీ అభ్యర్థుల మెజారిటీ లక్ష ఓట్లలోపే ఉండటం గమనార్హం. రాజంపేటలో మిధున్ రెడ్డి(76,071), కడపలో అవినాశ్ రెడ్డి(62,695), అరకులో గుమ్మ తనుజా రాణి(50,580), తిరుపతిలో గురుమూర్తి(14,569) విజయం సాధించారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలోని 20 మంది అభ్యర్థులకు కనీసం లక్ష ఓట్లకు పైగా మెజారిటీ రాగా ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అత్యల్పంగా 50,199 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

News June 5, 2024

పార్టీల వారీగా ఓట్ల పర్సంటేజ్

image

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 36.56శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానాల్లో INC(21.19%), SP(4.58%), TMC(4.37%), YSRCP(2.06%), BSP(2.04%), TDP(1.98%) RJD(1.57%), శివసేనUBT(1.48%), BJD(1.46%), NCP-శరద్ పవార్(0.92%) పార్టీలున్నాయి.

News June 5, 2024

BREAKING: ప్రిలిమ్స్ వాయిదా వేయలేం: HC

image

TG: గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్ మరో తేదీకి మార్చాలని దాఖలైన పిటిషన్‌పై వ్యాఖ్యానించింది.

News June 5, 2024

జైలులో ఉన్న అభ్యర్థులు ఎలా ప్రమాణం చేస్తారు?

image

జైలులో ఉన్న అమృత్ పాల్, షేక్ అబ్దుల్ రషీద్ నిన్న వెలువడిన ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందారు. అయితే, వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు పార్లమెంట్‌కు రావాల్సి ఉంటుంది. దీనికోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. వీరిని ప్రత్యేక భద్రత నడుమ పార్లమెంట్‌కు తీసుకెళ్లి ప్రమాణస్వీకారం కాగానే తిరిగి జైలుకి తీసుకొస్తారు. దోషులుగా తేలి, రెండేళ్లు జైలులో ఉంటే వీరిపై అనర్హత వేటు పడుతుంది.

News June 5, 2024

పవన్ వల్లే కూటమి సాధ్యమైంది: చంద్రబాబు

image

AP: కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకతాటిపైకి వచ్చి సమష్టిగా పని చేశాయని తెలిపారు. ‘గత ఐదేళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.