India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు బయల్దేరారు. కౌంటింగ్ సరళిపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించే ఛాన్సుంది. అనంతరం ఇవాళ రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని భేటీ కానున్నారు.
AP: రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు తన సమీప ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకి 78,322 ఓట్లు నమోదయ్యాయి.
AP: నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 31971 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అలాగే కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
రాష్ట్రంలో ఒక్క MP సీటును గెలవకపోవడంపై కేటీఆర్ స్పందించారు. ‘TRS స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశాం. తెలంగాణను సాధించడమే మా అతిపెద్ద విజయం. 2014లో 63/119, 2018లో 88/119 సీట్లు సాధించాం. ప్రస్తుతం 39 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. నేటి ఎన్నికల ఎదురుదెబ్బ కచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాం. మళ్లీ గట్టిగా తిరిగొస్తాం’ అని ట్వీట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ రికార్డు సృష్టించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్‌సభ స్థానంలో 11,75,092 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత అత్యధికంగా నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
రాయలసీమలోని ఆళ్లగడ్డ, జమ్మలమడుగులో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నాలుగో విజయం దక్కింది. బద్వేలులో బీజేపీ నేత బొజ్జా రోషన్నపై దాసరి సుధ, మంత్రాలయంలో టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డిపై బాలనాగిరెడ్డి గెలిచారు. పులివెందులలో వైఎస్ జగన్, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు.
APలో తిరుగులేని మెజార్టీతో NDA ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం, ప్రభుత్వ ఏర్పాటు సహా పలు అంశాలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు.
యూపీలో ‘మాయ’ పనిచేయలేదు! BJP తక్కువ సీట్లకే పరిమితం కావడానికి BSP ఎంతోకొంత కారణమైంది. 9.5% ఓటుషేర్ సాధించినా విపక్ష ఓట్లను చీల్చలేకపోయింది. దాంతో కాంగ్రెస్, ఎస్పీ అనూహ్యంగా పుంజుకున్నాయి. ముస్లిం, యాదవ, ఎస్సీ సామాజిక వర్గాలు వీరివైపే మొగ్గాయి. మాయావతి ఓట్లు చీల్చివుంటే గెలుపు కమలం వైపే ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. 2019లో ఎస్పీ భాగస్వామ్యంతో 10 సీట్లు గెలిచిన ఏనుగు పార్టీ ఈసారి ఖాతా తెరవలేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. శశిథరూర్ ఈ నియోజకవర్గంలో గెలవడం ఇది నాలుగో సారి. మరోవైపు సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలో హసన్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్‌పై 40వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు.
Sorry, no posts matched your criteria.