News June 4, 2024
రిజల్ట్స్.. మెజారిటీలో ఆల్‌టైమ్ రికార్డు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ రికార్డు సృష్టించారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్‌సభ స్థానంలో 11,75,092 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత అత్యధికంగా నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 12, 2024
కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా
విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.
News November 12, 2024
6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
AP: కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.
News November 12, 2024
సిల్వర్‌ను బీట్ చేసిన BITCOIN: అతిపెద్ద 8వ అసెట్‌గా రికార్డ్
బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. $1.752 ట్రిలియన్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో అసెట్‌గా అవతరించింది. $1.726 ట్రిలియన్లతో ఉన్న సిల్వర్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో BTC ఏకంగా 9% పెరిగి $88,570 డాలర్లకు చేరడం గమనార్హం. మెటా $1.472, టెస్లా $1.124, బెర్కషైర్ హాత్‌వే $1.007 ట్రిలియన్ల కన్నా BTC విలువే ఎక్కువ. ఇక బంగారం $17.6 ట్రిలియన్లతో అతిపెద్ద అసెట్‌గా ఉంది.