India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొత్తం 5 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. బీజేపీ, ఇండియా కూటమి చెరో 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఇతరులు ఒక్క ప్లేస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లఢక్‌లోని ఏకైక స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌లో ప్రస్తుతం 30వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. 2019లో ఆయన ఇక్కడ 5లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
AP: యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి యడం బాలాజీ వెనుకంజలో ఉన్నారు.
యూపీ వారణాసిలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ఆధిక్యంలోకి వచ్చారు. తొలుత 6వేలకు పైగా ఓట్లతో వెనుకబడ్డ మోదీ.. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ పోటీ చేస్తున్నారు.
కడప అసెంబ్లీలో 10వేల ఓట్ల మెజార్టీలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి దిశగా సాగుతున్నారు. ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీ అభ్యర్థులు వరదరాజులరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి లీడింగులోకి వచ్చారు.
AP: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్రలో కూటమి జోరు కొనసాగుతోంది. గాజువాక, విశాఖ తూర్పు, విజయనగరం, ఎచ్చెర్ల, పాతపట్నం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లిలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు అనకాపల్లి, విజయనగరం, విశాఖ లోక్‌సభ ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటం.. ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నింపింది.
ప్రస్తుత ఓట్ల లెక్కింపును బట్టి ‘ఇతరులు’ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గత రెండు దఫాల్లో థంపింగ్ మెజార్టీ రావడంతో బీజేపీకి వారితో అవసరం పడలేదు. ఉదయం 10 గంటలకు ఏఐఏడీఎంకే 5, ఎంఐఎం 2, బీఎస్పీ 2, బీజేడీ ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇండియా, ఎన్డీయే కూటములకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే వీరికి గిరాకీ భారీగా పెరుగుతుంది. మాయావతి, పళనిస్వామి, అసదుద్దీన్ ఒవైసీకి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.
AP: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ కుమార్‌పై 3,400 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు. రంపచోడవరంలో వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 114 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
AP: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థులు కందుకూరులో ఇంటూరి, ఒంగోలులో దామచర్ల, కొండపిలో స్వామి, నెల్లూరు సిటీలో నారాయణ, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు దర్శిలో బూచేపల్లి, సర్వేపల్లిలో కాకాణి లీడింగ్‌లో ఉన్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ నుంచి పి.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. తొలుత వెనుకంజలో ఉన్నా ఆ తర్వాత లీడ్‌లోకి వచ్చారు.
Sorry, no posts matched your criteria.