India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ముందంజలో ఉన్నారు.
AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ లీడింగులో ఉన్నారు. స్థానికంగా సొంత పార్టీ నేతల నుంచే ఆమె అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. తన గెలుపుకు సొంత నేతలే సహకరించడం లేదని పోలింగ్ రోజున రోజానే స్వయంగా చెప్పారు. మైదుకూరు TDP అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడింగులో కొనసాగుతున్నారు. అక్కడ YCP MLA రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
AP: రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి పురందీశ్వరి, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్‌లో ఉన్నారు.
TG: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య ముందంజలో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్ మొత్తం 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఎన్నికల ఫలితాల రోజున దలాల్ స్ట్రీట్ వర్గాల స్పందనపై ఆసక్తి నెలకొంది. 2004 ఎన్నికల ఫలితాల రోజున సెన్సెక్స్, నిఫ్టీ 11.10% – 12.20% నష్టపోయాయి. అయితే, 2009లో సెన్సెక్స్ – నిఫ్టీ రెండూ 17% కంటే అధికంగా ఎగబాకాయి. 2014 ఎన్నికల ఫలితాల రోజున బెంచ్‌మార్క్ సూచీలు 0.90% పెరిగాయి, అదే 2019లో 0.76% తగ్గాయి. మరి ఈ రోజు మార్కెట్ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఆధిక్యంలో ఉన్నారు.
బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్జేడీ నుంచి ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ వారసులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో వారి కుమార్తెలు వెనుకంజలో ఉన్నారని అప్డేట్స్ వస్తున్నాయి. సరణ్‌లో రాజీవ్ ప్రతాప్ రూఢీకి రోహిణీ ఆచార్య పోటీనివ్వలేకపోతున్నారు. పాటలీపుత్రలో మీసా భారతికి కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్ కృపాల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపుతున్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో 20 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది. వారణాసిలో మోదీ, అమేథీలో స్మృతి ఇరానీ, సుల్తాన్‌పూర్‌లో మేనకగాంధీ దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎస్పీలో అఖిలేశ్ యాదవ్ అతడి భార్య డింపుల్ ముందంజలో ఉన్నారు.
పెద్దపల్లి, నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఏపీలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కూటమి 33 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇందులో టీడీపీ 28 చోట్ల, జనసేన 5 స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పూతలపట్టులో మురళీ మోహన్ లీడ్‌లో ఉన్నారు. ఇక పిఠాపురంలో పవన్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ లీడ్ కనబరుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.