News June 4, 2024
UP: 20 స్థానాల్లో బీజేపీ, 3 సీట్లలో కాంగ్రెస్ ముందంజ
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపుతున్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో 20 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది. వారణాసిలో మోదీ, అమేథీలో స్మృతి ఇరానీ, సుల్తాన్‌పూర్‌లో మేనకగాంధీ దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎస్పీలో అఖిలేశ్ యాదవ్ అతడి భార్య డింపుల్ ముందంజలో ఉన్నారు.
Similar News
News November 13, 2024
ఒక్కటవుతున్న పాక్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు
పాకిస్థాన్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు ఇయాజ్, లారెన్ ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ‘రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రభాస్ వీరాభిమానులు కలిసి తమ జీవితాలను ఆస్వాదించబోతున్నారు. లారెన్ కోసం సప్త సముద్రాలను దాటొచ్చా’ అని ఇయాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరికి విషెస్ చెబుతున్నారు.
News November 13, 2024
భారత్ బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
భారత్‌తో మూడో టీ20లో సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు.
IND: శాంసన్, అభిషేక్, సూర్య, తిలక్, హార్దిక్, అక్షర్, రమన్‌దీప్, రింకూ సింగ్, బిష్ణోయ్, వరుణ్, అర్ష్‌దీప్
SA: రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమెలనే, కోయెట్జీ, మహారాజ్, సిపమ్లా
News November 13, 2024
మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం
APలో మరో నాలుగు కార్పొరేషన్ల డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్టర్లను నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం ఇవ్వగా, మిగతా 12 మంది టీడీపీ వాళ్లే. జాబితా కోసం ఇక్కడ <