India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రత్యర్థి వంగా గీతపై 1000 ఓట్లకు పైగా ఆధిక్యంలో పవన్ ఉన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 65,22,772 ఓట్లు పోల్ అయ్యాయి. బిహార్‌లో అత్యధికంగా 8.16 లక్షల ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లో 7.25 లక్షలు, తమిళనాడులో 5.50 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 5.46 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో 4.88 లక్షల ఓట్లు పోలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 1.28% ఓట్లు నోటాకు పోలయ్యాయి.
AP: మండపేటలో టీడీపీ లీడ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు నంద్యాల లోక్‌సభలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 255కు పైగా సీట్లలో ఎన్డీఏ, 161 సీట్లలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గాంధీ నగర్‌లో అమిత్ షా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా చెల్లనివి నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు చెల్లనివిగా తేలడంతో దీనిపై ఇరు వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఉత్కంఠగా మారింది.
ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ముందంజలో ఉన్నారు.
కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు ముందంజలో ఉన్నారు.
వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ లీడింగులో ఉన్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆయన ఆధిపత్యం ప్రదర్శించారు. అలాగే తొలిరౌండులోనూ ఆయనకే గంపగుత్తగా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి శివుడికి అత్యంత ఇష్టమైన నగరంలో రికార్డులు సృష్టించడం ఖాయమే. 2014, 2019లోనూ ఆయన భారీ మార్జిన్‌తో గెలుపొందడం విశేషం. ఇక్కడ ఆయన స్థాయికి తగిన ప్రత్యర్థి లేకపోవడం గమనార్హం.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ లీడింగ్‌లో ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి గోదం నగేశ్ బరిలో నిలిచారు.
వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు మండిలో BJP MP అభ్యర్థి కంగనా రనౌత్ వెనుకబడగా, బారామతిలో NCP శరద్ వర్గం నుంచి బరిలో నిలిచిన సుప్రియా సూలే లీడ్‌లో ఉన్నారు. మరోవైపు బీహార్‌లో లాలూ కూతుళ్లు ఇద్దరూ వెనకబడ్డారు. పాటలీపుత్రలో మీసా భారతి, సరన్ నుంచి రోహిణి NDA అభ్యర్థుల కంటే వెనకంజలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.