India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అరకు ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి తనుజారాణి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో కూటమి అభ్యర్థి గీతకు 2,566 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి తనూజ రాణికి 3,823 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 1,357 ఓట్లు ఆధిక్యంతో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అప్పలనరస 866 ఓట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు.
కమలానికి కంచుకోటలా భావించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడింది. అక్కడ 80 ఎంపీ స్థానాలుండగా 42 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం.
✒ రాజంపేట ఎంపీ- కిరణ్ కుమార్ రెడ్డి(BJP) 3,000 ఓట్ల లీడింగ్
✒ ఉరవకొండ ఎమ్మెల్యే – పయ్యావుల కేశవ్(TDP) లీడింగ్
✒ రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు(TDP) లీడింగ్
✒ కడప ఎమ్మెల్యే- మాధవీరెడ్డి(TDP) 2,158 ఓట్ల లీడింగ్
✒ శింగనమల- బండారు శ్రావణి(TDP) ఆధిక్యం
✒ నంద్యాల- ఫరూఖ్(TDP) లీడింగ్
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
AP: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు లీడ్‌లో ఉన్నారు. బాపట్ల MP స్థానంలో TDP అభ్యర్థి కృష్ణప్రసాద్ లీడింగ్‌లో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన నేత బుద్ధప్రసాద్ ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ లీడింగ్‌లో ఉన్నారు. ఇటు విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి లీడింగ్‌లో ఉన్నారు.
మెదక్‌లో BRSకు షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముందంజలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో గెలుపొందడంతో మరోసారి గెలుస్తామని బీఆర్ఎస్ ఆశించినా తొలి రౌండ్‌లో నిరాశే ఎదురైంది.
ఏపీలో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకబడ్డారు. ప్రస్తుతానికి NDA కూటమి 80+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
AP: దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.