India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సూచీల ఘోర పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. నేడు ఒక్కరోజే ఏకంగా రూ.21 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. దాంతో బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.404.42 లక్షల కోట్లకు తగ్గింది. ఇక పదేళ్ల బాండ్ ఈల్డు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.04 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక దిగాలు పడుతున్నారు.
● టీడీపీ ముందుగానే సూపర్-6 పథకాలను ప్రకటించడం
● జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు
● ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రచారం
● చంద్రబాబు అరెస్టుతో కార్యకర్తల్లో కసి పెరగడం
● ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా వైసీపీ మార్చిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడం
● అభివృద్ధి లేదని పదేపదే చెప్పడం
● సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీలు
● చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు
నార్త్ ఇండియాలో ఓటర్లు NDAకు షాక్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో BJP కూటమికి ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ ఇండియాలో (ముఖ్యంగా AP, TGలో) NDAకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో నార్త్‌లో NDA ఓట్లు ఇండియా కూటమికి, సౌత్‌లో ఇండియా కూటమి ఓట్లు NDAకు మారినట్లు తెలుస్తోంది.
ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రాజు ఆ తర్వాత జగన్‌తో విబేధాలు, పార్టీ వైఖరి నచ్చక బయటకు రావడం తెలిసిందే.
తూర్పు భారత్‌లోని బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ జోరు కొనసాగుతోంది. బిహార్‌లో ఎన్డీఏ(బీజేపీ+జేడీ) 32, ఆర్జేడీ 6, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఒడిశాలో బీజేపీ 17, బీజేడీ 3, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఝార్ఖండ్‌లో బీజేపీ 8, కాంగ్రెస్ 6 చోట్ల మెజారిటీలో ఉన్నాయి.
‘ఆబ్కీ బార్ 400పార్’ కల చెదరడంతో స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. దాంతో సూచీలు ఈ దశాబ్దంలోనే అతి ఘోర పతనం చవిచూస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 4100 పాయింట్ల మేర కుంగింది. ప్రస్తుతం 3283 పాయింట్ల నష్టంతో 73,191, నిఫ్టీ 1063 తగ్గి 22,200 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగుకు పాల్పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ ఎంత పెరిగిందో రిజల్టుతో అంతకన్నా ఎక్కువే పడింది.
TG: ఖమ్మంలో కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 2.16లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 126 చోట్ల, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 18 చోట్ల, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల లీడింగులో ఉన్నాయి.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీ లత ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ఆమె అన్నారు. గత పదేళ్లలో మోదీ అద్భుతంగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.