News June 4, 2024

RRR రాకింగ్

image

ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రాజు ఆ తర్వాత జగన్‌తో విబేధాలు, పార్టీ వైఖరి నచ్చక బయటకు రావడం తెలిసిందే.

Similar News

News November 10, 2024

సజ్జల భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News November 10, 2024

సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక

image

AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.

News November 10, 2024

ఎండీ ఆయుర్వేద ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇవాళ్టి నుంచి రేపు సా.4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే మెడికల్ పీజీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/