News June 4, 2024

తూర్పు భారతంలో బీజేపీ లీడింగ్

image

ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఒడిశాలో 14 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో బీజేడీ, ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బిహార్‌లో ఎన్డీఏ కూటమి మెజార్టీలో కొనసాగుతోంది. ఝార్ఖండ్‌లోనూ 8 స్థానాల్లో NDA కూటమి ముందంజలో ఉంది.

News June 4, 2024

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు దూరంగా ఎర్లీ ట్రెండ్స్‌

image

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే – ఇండియా కూట‌ముల మ‌ధ్య హోరాహోరి పోరు జ‌రుగుతోంది. ఎన్డీయే 285 స్థానాల్లో, ఇండియా కూట‌మి 221 స్థానాల్లో త‌మ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎర్లీ ట్రెండ్స్ ఉండ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. యూపీలో ఎన్డీయే 37 స్థానాల్లో, ఇండియా కూట‌మి 39 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.

News June 4, 2024

భారీ ఆధిక్యంలో పెమ్మసాని

image

AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై దాదాపు 40000+ పైగా మెజార్టీతో పెమ్మసాని ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పెమ్మసాని మెజార్టీ లక్షల్లో ఉంటుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

News June 4, 2024

మధ్యప్రదేశ్: క్లీన్‌స్వీప్ దిశగా బీజేపీ

image

లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని యూపీ దెబ్బకొట్టేలా ఉంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇక్కడ సగం వరకు సీట్లు కోల్పోవచ్చు! అయితే ఆ నష్టాన్ని మధ్య‌ప్రదేశ్ భర్తీచేసేలా కనిపిస్తోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో అన్నింట్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియా, శంకర్ లాల్వానీ, బంటీ వివేక్ సాహూ, అలోక్ శర్మ దూసుకెళ్తున్నారు. చింద్వాడలో నకుల్ కమల్‌నాథ్ వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

రాయలసీమలో కూటమి ప్రభంజనం

image

AP: ఎన్నికల కౌంటింగులో రాయలసీమ జిల్లాల్లో కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. మొత్తం 52 స్థానాలకు గాను ప్రస్తుతం 45 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కేవలం 7 స్థానాల్లోనే వైసీపీ నేతలు లీడింగులో ఉన్నారు.

News June 4, 2024

కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమే..

image

ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తోంది. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకెళ్తోంది.

News June 4, 2024

ఖమ్మంలో కాంగ్రెస్ లక్షా 26వేల ఆధిక్యం

image

ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి లక్షా 26వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నామా నాగేశ్వర్‌రావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

News June 4, 2024

దశాబ్దాల నిరీక్షణ.. మంగళగిరిలో టీడీపీ జెండా రెపరెపలు!

image

AP: గుంటూరు(D) మంగళగిరిలో TDP అభ్యర్థి నారా లోకేశ్ రికార్డు సృష్టించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో 15 వేలకు పైగా మెజార్టీలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో ఇక్కడ గెలిచింది. నారా లోకేశ్ గెలుపుతో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.

News June 4, 2024

పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ముందంజ

image

AP: పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి బోడె ప్రసాద్‌పై 275 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(SC)లో టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులు 2,758 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ధర్మాన సోదరుల వెనుకంజ

image

AP: SKLM జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. SKLM అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.