News June 4, 2024

BREAKING: మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

image

అత్యంత వివాదాస్పదంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో ఊహించని ఫలితం రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి 1,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, మాచర్లలో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో ఆ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

News June 4, 2024

జమ్మలమడుగులో ఆది నారాయణ లీడింగ్

image

AP: తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.

News June 4, 2024

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

image

TG: నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

భువనగిరిలో మారిన ఆధిక్యం

image

భువనగిరిలో ఆధిక్యం మారుతోంది. మొదట బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

బ్యాలెట్ బాక్స్ తాళం పగలగొట్టారు

image

రాజస్థాన్‌లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బన్స్వారా పోలింగ్ కేంద్రంలో సమయానికి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కీ కనిపించలేదు. దీంతో అధికారులు బ్యాలెట్ బాక్స్ తాళం పగలగొట్టి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభించారు. కాగా అక్కడ బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాలవీయ ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

ముందంజలో కేంద్ర మంత్రులు

image

గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అభ్యర్థి సోనల్ పటేల్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఆ రాష్ట్రాల‌పై బీజేపీ భారీ ఆశ‌లు

image

ఈ ఎన్నిక‌ల్లో గెలిచి మోదీ 3.0 ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని రాష్ట్రాల ఫ‌లితాల‌పై బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. ముఖ్యంగా బెంగాల్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో డ‌బుల్ డిజిట్ సీట్ల‌ను సాధించి కేంద్రంలో త‌న విజ‌యావ‌కాశాల‌ను సునాయాసం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంగా బీజేపీ ప‌నిచేసింది. అందుకే ఈ రాష్ట్రాల్లో ప్ర‌ధాని మోదీ వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో బీజేపీ ప్ర‌చారాన్ని హోరెత్తించారు.

News June 4, 2024

ఈసారి అత్య‌ధిక మెజారిటీ ఎవ‌రికి?

image

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న దానిపై ఆసక్తి నెల‌కొంది. 2019 ఎన్నిక‌ల్లో గుజరాత్‌లోని న‌వ్సారీ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సీఆర్ పాటిల్ 6.89 ల‌క్ష‌ల మెజారిటీతో, 2014లో వార‌ణాసి నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 5.70 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో క‌డ‌ప నుంచి వైఎస్ జ‌గ‌న్ 5.45 ల‌క్ష‌ల‌ మెజారిటీతో గెలిచారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లోభారీ మెజారిటీ ఎవ‌రిదో!

News June 4, 2024

కడప‌లో వైసీపీకి బిగ్ షాక్

image

AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనకబడ్డారు. పులివెందులలో సీఎం జగన్ లీడింగులో ఉన్నారు. అటు కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుకబడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లు వెనకబడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే.

News June 4, 2024

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

image

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.