News June 4, 2024
ముందంజలో కేంద్ర మంత్రులు
గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అభ్యర్థి సోనల్ పటేల్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ముందంజలో ఉన్నారు.
Similar News
News November 6, 2024
మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!
భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్‌కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.
News November 6, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు
AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.
News November 6, 2024
యువరాజ్ గర్వపడేలా ఆడేందుకు యత్నిస్తా: అభిషేక్
తన మెంటార్ యువరాజ్ సింగ్ గర్వపడేలా దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆడతానని భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. 2007లో యువీ 6 సిక్సులు కొట్టిన డర్బన్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యువీ ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూలో అభిషేక్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటి నుంచి ఆ మ్యాచ్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.