India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర వ్యాప్తంగా EVMలో లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌ల ఓట్ల లెక్కింపు 8గంటలకు ప్రారంభం కాగా, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది.
2024 ఎన్నికల్లో భాజపా ఎక్కువగా ఫోకస్ చేసిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ 2014లో 34, 2019లో 22 సీట్లు గెలుచుకుంది. 2014లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2019లో ఆ సంఖ్యను 18కి పెంచుకుంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు వెలువడే ఫలితాలు బెంగాల్‌లో కీలకంగా మారనున్నాయి.
అతి పెద్ద బ్యాటిల్ గ్రౌండులో ఆరితేరినవాడే విజేతగా ఆవిర్భవిస్తాడు. లోక్‌సభ ఎన్నికల్లోనూ అంతే. అత్యధిక సీట్లున్న యూపీని ఒడిసిపడితేనే పార్లమెంటులో జయకేతనం ఎగరేస్తారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాకు ఇది బాగా తెలుసు. అందుకే ఈ జోడీ అంతలా శ్రద్ధపెట్టింది. కుల, మత, వర్గ సమీకరణాలతో పాటు సంక్షేమం, శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు 80కి 70+ సీట్లు వస్తాయని అంచనా.
AP: రాష్ట్రంలో ఉరవకొండ, శింగనమల(అనంతపురంD) సెగ్మెంట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతుంది. శింగనమలలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో వీటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. శింగనమలలో వీరాంజనేయులు(YCP), శ్రావణి(TDP), శైలజానాథ్(INC), ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి(YCP), పయ్యావుల కేశవ్(TDP) బరిలో ఉన్నారు.
AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో టీడీపీ అధినేత చంద్రబాబు 1,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ వైసీపీ నుంచి KRJ భరత్ బరిలో ఉన్నారు.
దేశ రాజధాని పరిధిలోని 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీగా ఉన్న ఆప్ కనీసం ఒక్క చోట కూడా లీడ్ కనబర్చడం లేదు. కేజ్రీవాల్ ఎన్నికల ముందు బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదు అన్పిస్తోంది.
AP:ఉత్తరాంధ్రలో 2019 ఫలితాల్లో TDP 34 స్థానాలకు గాను 6 స్థానాల్లోనే గెలిచింది. SKLMలో 10 స్థానాలకు గాను 2, ఉమ్మడి VSPలో 15 స్థానాలకు గాను 4 స్థానాల్లోనే గెలిచింది. VZMలో 9 స్థానాలుండగా TDP ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో TDP, జనసేన, BJP కూటమిగా బరిలో దిగడంతో పరిస్థితి మారుతుందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయనగరంలో కూటమి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
AP: రెండు ప్రధాన పార్టీల(YCP, TDP) అధ్యక్షులు వైఎస్ జగన్(పులివెందుల), చంద్రబాబు(కుప్పం) సహా పలువురు ప్రముఖులు రాయలసీమ నుంచి బరిలో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(రాజంపేట ఎంపీ), బాలకృష్ణ(హిందూపురం) గెలుపోటములపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కిరణ్ తొలిసారి ఎంపీ బరిలో నిలిచారు.
రాజమండ్రి రూరల్ స్థానంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ 900కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ లీడింగ్‌లో ఉన్నారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొదటి ఫలితం నిజామాబాద్ నుంచే వెలువడనుంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీలో ఉన్నారు. ఓట్ల కౌంటింగ్ కోసం 140 టేబుళ్లు ఏర్పాటు చేయగా 15రౌండ్లలో ఫలితం తేలనుంది.
Sorry, no posts matched your criteria.