News June 3, 2024

వీరికి ఓటమే: టైమ్స్ నౌ

image

లోక్‌సభ-2024 ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి పాలవుతారని టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. కృష్ణానగర్‌లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మండీలో కంగనా రనౌత్, కన్నౌజ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర నేతలకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది.

News June 3, 2024

ఎవరు గెలుస్తారో చెబితే రూ.10లక్షలు: భారత నాస్తిక సమాజం

image

TG: దేశంలో, రాష్ట్రంలో రేపటి కౌంటింగ్‌లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ముందే కచ్చితంగా చెప్పే జ్యోతిషులను సన్మానించి, రూ.10లక్షలు ఇస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య ప్రకటించారు. అలాకాని పక్షంలో జ్యోతిషం తప్పని ఒప్పుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడో ఉండే గ్రహాలు భూమిపై ఉన్న మానవునిపై ప్రభావం చూపుతాయా? అని ప్రశ్నించారు. దీనిపై జ్యోతిషులు మండిపడుతున్నారు.

News June 3, 2024

అలా చేస్తే మళ్లీ ప్రభాస్‌తో నటిస్తా: శ్రద్ధా కపూర్‌

image

‘సాహో’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు జోడీగా నటించిన శ్రద్ధా కపూర్‌కు మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రద్ధా కపూర్‌ స్పందించారు. ‘ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు సినిమా చేస్తా’ అంటూ ఫన్నీగా ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చారు. దీనికి ‘ప్రభాస్ హోమ్ ఫుడ్‌కి శ్రద్ధా ఫిదా అయ్యారేమో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News June 3, 2024

కాసేపట్లో పాలిసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: పాలిసెట్ ఫలితాలు నేడు మ.12 గంటలకు విడుదల కానున్నాయి. https://sbtet.telangana.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు.

News June 3, 2024

మూవీ థియేటర్‌లో వివక్ష.. సంచార జాతి వారికి టికెట్లివ్వని వైనం

image

సంచార జాతివారికి సినిమా థియేటర్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపిన ఘటన తమిళనాడులో జరిగింది. 30మంది సంచార జాతి వారు కడలూర్(D)లో వంట పాత్రలు అమ్మేందుకు వచ్చారు. కడలూర్‌లోని ఓ థియేటర్‌కు వీరంతా సినిమా చూసేందుకు వెళ్ళగా యాజమాన్యం టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో వారు RDOకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ వారిని థియేటర్‌కు తీసుకెళ్లి సొంత డబ్బుతో మూవీ చూపించారు. యాజమాన్యంపై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు.

News June 3, 2024

మేజర్ లీగ్ క్రికెట్‌లోకి కమిన్స్ ఎంట్రీ!

image

ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నీలో ఆడనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీమ్‌తో అతడు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. MLC రెండో సీజన్ జులై 5 నుంచి ప్రారంభంకానుంది. US ఫ్రాంచైజీలు రూ.కోట్లు ఆఫర్ చేస్తుండటంతో స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. రస్సెల్, నరైన్, మ్యాక్సీ, హెడ్ లాంటి ప్లేయర్లు ఇప్పటికే టోర్నీలో భాగస్వాములయ్యారు.

News June 3, 2024

RESULTS.. అసలు లెక్కలు తేలేది రేపే

image

AP ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక్కో సంస్థ ఒక్కొక్కరికి అధికారం దక్కుతుందని అంచనా వేయడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న జరిగే కౌంటింగ్‌తో ఈ టెన్షన్‌కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై పార్టీలతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News June 3, 2024

India Today అంచనాలు తప్పుతాయి: మాజీ ఐఏఎస్

image

AP అసెంబ్లీ ఎన్నికలపై India Today Axis My India అంచనాలు తప్పుతాయని మాజీ ఐఏఎస్ అధికారి PVS శర్మ తెలిపారు. ‘పోలింగ్‌ రోజున సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటర్ల అభిప్రాయాలను సేకరించడంలో Axis My India విఫలమైంది. సీఎం జగన్ వ్యూహం ప్రకారం ఆ ఓట్లు వైసీపీకే అనుకూలం. ఈ సంస్థ పార్లమెంట్ నియోజకవర్గానికి 250-300 శాంపిల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇదో అనైతిక సర్వే’ అని ట్వీట్ చేశారు.

News June 3, 2024

FLASH: సూపర్ ఓవర్‌లో నమీబియా గెలుపు

image

T20WCలో నమీబియా-ఒమన్ మ్యాచ్ టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో నమీబియా ఘన విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటర్లు డేవిడ్ వైస్, ఎరాస్మస్ 6 బంతుల్లో 21 రన్స్(4,6,2,1,4,4) చేశారు. ఒమన్ 10 పరుగులు(2,0,W,1LB,1,6) మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఒమన్ 19.4 ఓవర్లలో 109/10, నమీబియా 20 ఓవర్లలో 109/6 స్కోరు చేశాయి.

News June 3, 2024

ఆ మందులతో డేంజర్!

image

మధుమేహం, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్, వెగోవి వంటి మందులు ఉదర పక్షవాతానికి దారితీస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీటిలోని GLP-1 అనే హార్మోన్లు జీర్ణాశయంపై దుష్ప్రభావాలు కలిగిస్తాయట. ఫలితంగా డయేరియా, వాంతులతో పాటు ఉదర పక్షవాతం, ఆక్యూట్ పాంక్రియాటైటిస్ తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిలో ఉదర కండరాలు బలహీనపడతాయి. దీంతో జీర్ణాశయంలో ఆహారం ఎక్కువ సేపు నిలిచిపోతుంది.