India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పాలిసెట్ ఫలితాలు నేడు మ.12 గంటలకు విడుదల కానున్నాయి. https://sbtet.telangana.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు.
సంచార జాతివారికి సినిమా థియేటర్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపిన ఘటన తమిళనాడులో జరిగింది. 30మంది సంచార జాతి వారు కడలూర్(D)లో వంట పాత్రలు అమ్మేందుకు వచ్చారు. కడలూర్‌లోని ఓ థియేటర్‌కు వీరంతా సినిమా చూసేందుకు వెళ్ళగా యాజమాన్యం టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో వారు RDOకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ వారిని థియేటర్‌కు తీసుకెళ్లి సొంత డబ్బుతో మూవీ చూపించారు. యాజమాన్యంపై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నీలో ఆడనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీమ్‌తో అతడు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. MLC రెండో సీజన్ జులై 5 నుంచి ప్రారంభంకానుంది. US ఫ్రాంచైజీలు రూ.కోట్లు ఆఫర్ చేస్తుండటంతో స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. రస్సెల్, నరైన్, మ్యాక్సీ, హెడ్ లాంటి ప్లేయర్లు ఇప్పటికే టోర్నీలో భాగస్వాములయ్యారు.
AP ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక్కో సంస్థ ఒక్కొక్కరికి అధికారం దక్కుతుందని అంచనా వేయడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న జరిగే కౌంటింగ్‌తో ఈ టెన్షన్‌కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై పార్టీలతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
AP అసెంబ్లీ ఎన్నికలపై India Today Axis My India అంచనాలు తప్పుతాయని మాజీ ఐఏఎస్ అధికారి PVS శర్మ తెలిపారు. ‘పోలింగ్ రోజున సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటర్ల అభిప్రాయాలను సేకరించడంలో Axis My India విఫలమైంది. సీఎం జగన్ వ్యూహం ప్రకారం ఆ ఓట్లు వైసీపీకే అనుకూలం. ఈ సంస్థ పార్లమెంట్ నియోజకవర్గానికి 250-300 శాంపిల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇదో అనైతిక సర్వే’ అని ట్వీట్ చేశారు.
T20WCలో నమీబియా-ఒమన్ మ్యాచ్ టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో నమీబియా ఘన విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటర్లు డేవిడ్ వైస్, ఎరాస్మస్ 6 బంతుల్లో 21 రన్స్(4,6,2,1,4,4) చేశారు. ఒమన్ 10 పరుగులు(2,0,W,1LB,1,6) మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఒమన్ 19.4 ఓవర్లలో 109/10, నమీబియా 20 ఓవర్లలో 109/6 స్కోరు చేశాయి.
మధుమేహం, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్, వెగోవి వంటి మందులు ఉదర పక్షవాతానికి దారితీస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీటిలోని GLP-1 అనే హార్మోన్లు జీర్ణాశయంపై దుష్ప్రభావాలు కలిగిస్తాయట. ఫలితంగా డయేరియా, వాంతులతో పాటు ఉదర పక్షవాతం, ఆక్యూట్ పాంక్రియాటైటిస్ తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిలో ఉదర కండరాలు బలహీనపడతాయి. దీంతో జీర్ణాశయంలో ఆహారం ఎక్కువ సేపు నిలిచిపోతుంది.
TG: ఆదాయం పెంచుకోవడంలో భాగంగా త్వరలోనే సాగు, సాగేతర భూముల మార్కెట్ విలువ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవ ధరలు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ దిశగా ఆలోచిస్తోంది. గతంలో ఎంత విలువ పెంచారు? ఎంత ఆదాయం వచ్చింది అనే అంశంపై ప్రభుత్వం ఇటీవల ఆరా తీసింది. ప్రాంతాన్ని బట్టి 22-40% పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. అటు రిజిస్ట్రేషన్ ఫీజునూ పెంచే ఛాన్సుంది.
దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు స్టాక్ మార్కెట్‌లో జోష్ నింపాయి. ఉదయం 2500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ప్రస్తుతం 2053 పాయింట్ల లాభంతో చరిత్రలో తొలిసారిగా 76,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 605 పాయింట్ల లాభంతో 23,136 వద్ద కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు మార్కెట్లలో ఇదే జోష్ ఉంటుందేమో చూడాలి మరి.
T20WCలో భాగంగా ఇవాళ జరిగిన ఒమన్-నమీబియా మ్యాచ్ టై అయ్యింది. తొలుత ఒమన్ 109/10 స్కోర్ చేయగా, నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కాసేపట్లో సూపర్ ఓవర్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.