India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20WCలో నమీబియా-ఒమన్ మ్యాచ్ టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో నమీబియా ఘన విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటర్లు డేవిడ్ వైస్, ఎరాస్మస్ 6 బంతుల్లో 21 రన్స్(4,6,2,1,4,4) చేశారు. ఒమన్ 10 పరుగులు(2,0,W,1LB,1,6) మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఒమన్ 19.4 ఓవర్లలో 109/10, నమీబియా 20 ఓవర్లలో 109/6 స్కోరు చేశాయి.
మధుమేహం, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్, వెగోవి వంటి మందులు ఉదర పక్షవాతానికి దారితీస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీటిలోని GLP-1 అనే హార్మోన్లు జీర్ణాశయంపై దుష్ప్రభావాలు కలిగిస్తాయట. ఫలితంగా డయేరియా, వాంతులతో పాటు ఉదర పక్షవాతం, ఆక్యూట్ పాంక్రియాటైటిస్ తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిలో ఉదర కండరాలు బలహీనపడతాయి. దీంతో జీర్ణాశయంలో ఆహారం ఎక్కువ సేపు నిలిచిపోతుంది.
TG: ఆదాయం పెంచుకోవడంలో భాగంగా త్వరలోనే సాగు, సాగేతర భూముల మార్కెట్ విలువ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవ ధరలు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ దిశగా ఆలోచిస్తోంది. గతంలో ఎంత విలువ పెంచారు? ఎంత ఆదాయం వచ్చింది అనే అంశంపై ప్రభుత్వం ఇటీవల ఆరా తీసింది. ప్రాంతాన్ని బట్టి 22-40% పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. అటు రిజిస్ట్రేషన్ ఫీజునూ పెంచే ఛాన్సుంది.
దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు స్టాక్ మార్కెట్లో జోష్ నింపాయి. ఉదయం 2500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ప్రస్తుతం 2053 పాయింట్ల లాభంతో చరిత్రలో తొలిసారిగా 76,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 605 పాయింట్ల లాభంతో 23,136 వద్ద కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు మార్కెట్లలో ఇదే జోష్ ఉంటుందేమో చూడాలి మరి.
T20WCలో భాగంగా ఇవాళ జరిగిన ఒమన్-నమీబియా మ్యాచ్ టై అయ్యింది. తొలుత ఒమన్ 109/10 స్కోర్ చేయగా, నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కాసేపట్లో సూపర్ ఓవర్ జరగనుంది.
రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో
582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం(D)లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
ఇజ్రాయెల్ పాస్‌పోర్టు ఉన్నవారు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు మాల్దీవులు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చట్టాలను మార్చే ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది దాదాపు 11,000 మంది ఇజ్రాయెలీలు ఆ దేశంలో పర్యటించారు.
బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌తో మేకర్స్ ‘కల్కి’ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.
మహారాష్ట్రలోని పుణేలో ఓ మైనర్(17) నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు IT ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులు అగర్వాల్, శివానీలు జైలుపాలయ్యారు. కేసులో కీలకమైన రక్త నమూనాలను వీరు మార్చేందుకు యత్నించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 5 వరకు వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో భాగమైన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.