India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో
582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం(D)లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
ఇజ్రాయెల్ పాస్‌పోర్టు ఉన్నవారు తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు మాల్దీవులు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చట్టాలను మార్చే ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది దాదాపు 11,000 మంది ఇజ్రాయెలీలు ఆ దేశంలో పర్యటించారు.
బుజ్జి, భైరవ క్యారెక్టర్స్‌తో మేకర్స్ ‘కల్కి’ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.
మహారాష్ట్రలోని పుణేలో ఓ మైనర్(17) నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు IT ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులు అగర్వాల్, శివానీలు జైలుపాలయ్యారు. కేసులో కీలకమైన రక్త నమూనాలను వీరు మార్చేందుకు యత్నించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 5 వరకు వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో భాగమైన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
TG: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం 10 గంటల వరకు భూపాలపల్లి, గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 40Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
AP: గ్రామస్థాయిలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి WHO భాగస్వామ్యంతో 30 ఏళ్లు పైబడిన వారికి టెస్టులు చేపట్టనుంది. విలేజ్ క్లినిక్ స్థాయిలో CHO, ANMలు పరీక్షలు చేస్తారు. ఎవరికైనా అసాధారణ ఫలితాలు వస్తే జిల్లా మెడికల్ కాలేజీల్లో పరీక్షించి, చికిత్స చేస్తారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 40.2% ఓట్లు పోలయ్యాయి. SA ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన నెల్సన్ మండేలా నడిపిన పార్టీ ఇది. గత 30 ఏళ్లలో ఆ పార్టీ మెజార్టీ మార్కుని అందుకోలేకపోవడం ఇది తొలిసారి. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
AP: ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023-24లో మిచాంగ్ తుఫాను నష్ట పరిహారాన్ని 8.89 లక్షల మంది రైతులకు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. బ్యాంక్ అకౌంట్లు, IFSC, ఆధార్ నంబర్ సరిపోలకపోవడం వంటి కారణాలతో కొందరికి జమ కాలేదని పేర్కొంది. ఈ సమస్యల్ని పరిష్కరించిన అనంతరం జమ చేస్తామని వెల్లడించింది. మీ ఖాతాలో <
గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు వారంపాటు సాగే చిత్రీకరణతో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.