News October 23, 2024

కొనుగోలుదారులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోలుదారులకు షాక్. 10గ్రా. గోల్డ్ రేట్ రూ.80వేలు దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా. ధర రూ.430 పెరిగి రూ.80,070గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రా. ధర రూ.400 పెరిగి రూ.73,400గా నమోదైంది. అంటు వెండి రేటు కూడా తగ్గేదేలే అంటోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.2000 పెరిగి రూ.1,12,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

News October 23, 2024

ALERT.. కొత్త ఇన్‌సైడర్ ట్రేడింగ్ రూల్స్

image

మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో ట్రాన్స్‌పరెన్సీ పెంచేలా NOV 1 నుంచి సెబీ కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇకపై ఏ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కీలక ఉద్యోగి/ట్రస్టీ/వారి సమీప బంధువులైనా ఆయా AMCలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లలో ఒక త్రైమాసికంలో రూ.15లక్షలకు మించి లావాదేవీలు చేస్తే, 2 రోజుల్లోనే కంప్లయన్స్ అధికారికి తెలియజేయాలి. కొన్న యూనిట్లను లాభాల కోసం నెల రోజుల్లో అమ్మకూడదు. అమ్మినా కారణం తెలియజేయాలి.

News October 23, 2024

60 ఏళ్ల క్రితం రూ.570.. ఇప్పుడు ₹63లక్షలు

image

రోలెక్స్ వాచ్ గురించి నేటి యువతకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమందికి డ్రీమ్ వాచ్ ఇది. అయితే, యూఎస్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ సైతం 1960లో ఎంతో ఇష్టంగా రోలెక్స్ GMTని $120(అప్పుడు రూ.570)కి కొన్నారు. తాజాగా దీనిని విక్రయించేందుకు తీసుకెళ్లగా ఇది అత్యంత విలువైనదని తెలుసుకున్నారు. నేటి మార్కెట్‌ విలువ ప్రకారం ఈ గడియారానికి $75,000 (రూ.63,06,723)వరకు వస్తుందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.

News October 23, 2024

మీదేమైనా తమిళ పేరా: ఉదయనిధి స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్

image

ఉదయనిధి స్టాలిన్ ఏమైనా తమిళ పేరా అని కేంద్ర‌మంత్రి L మురుగన్ ప్రశ్నించారు. DMK అంటేనే డిస్క్రిమినేషన్‌ అని, ముందు మీ ఫ్యామిలీలో తమిళ పేర్లు పెట్టుకోవాలని చురకలు అంటించారు. ‘రాష్ట్రంలో ఎవరూ బలవంతంగా హిందీని రుద్దడం లేదు. ఇష్టమున్న వాళ్లే నేర్చుకుంటారు. ఇందులో మీకేంటి బాధ’ అని ప్రశ్నించారు. కొత్త జంటలు తమ పిల్లలకు తమిళ పేర్లను పెడితే హిందీని రుద్దడం ఆగిపోతుందని ఉదయనిధి అనడంతో వివాదాస్పదంగా మారింది.

News October 23, 2024

కాసేపట్లో కోర్టుకు కేటీఆర్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ‌పై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై హీరో నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

News October 23, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమలో VRSపై సర్వే

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల VRSపై యాజమాన్యం సర్వే చేస్తోంది. VRS కోరుకునే ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్, 45 ఏళ్లలోపు వయసు ఉండాలని నిబంధన విధించింది. అర్హులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో VRS పేరుతో దగా చేస్తున్నారని, 2500 మందిని ఇంటికి పంపడానికి కుట్రలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే పరిహారం గురించి ప్రస్తావన లేకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

News October 23, 2024

STOCK MARKETS: ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా!

image

బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న బలమైన షేర్లను ఇన్వెస్టర్లు కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 80,381 (+158), నిఫ్టీ 24,521 (+49) వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా లేదా చూడాల్సి ఉంది. రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, మెటల్ షేర్లు పుంజుకున్నాయి.

News October 23, 2024

సిద్ధిఖీ హత్య.. నిందితుడికి టెన్త్‌లో 78% మార్కులు!

image

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన షూటర్స్‌లో ఒకడైన UPకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతను టెన్త్ క్లాస్‌లో 78శాతం మార్కులు సాధించినట్లు ధర్మరాజ్ సోదరుడు తెలిపారు. నాడు ధర్మరాజ్‌ను మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు భావించినట్లు చెప్పాడు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను చూసి ఆకర్షితుడయ్యాడని, డబ్బు కోసం తప్పుదారి పట్టాడని పేర్కొన్నారు.

News October 23, 2024

వ్యక్తిని దారుణంగా చంపి.. PSలో రీల్స్!

image

TG: కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని <<14421491>>హత్య<<>> చేసిన నిందితుడు సంతోష్ జగిత్యాల గ్రామీణ PSలో చేసిన రీల్ వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అయితే ఆ వీడియో గతంలోనిదని పోలీసులు వివరణ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ఫిర్యాదు చేసినా సంతోష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో పోలీసులు పట్టించుకోలేదని INC నేతలు ఆరోపించారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని మండిపడ్డారు.

News October 23, 2024

BREAKING: బంగాళాఖాతంలో తుఫాన్

image

తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫాన్‌గా మారింది. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం గంటకు 18కి.మీ వేగంతో ఇది కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ సైక్లోన్‌కు ‘దానా’గా నామకరణం చేశారు. విశాఖ తూర్పు ఆగ్నేయ దిశగా 724కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.