News April 5, 2024

47 ఏళ్ల మహిళతో నిశ్చితార్థం చేసుకున్న 70 ఏళ్ల నటుడు!

image

బ్రిటిష్ నటుడు జిమ్ డేవిడ్‌సన్ 70 ఏళ్ల వయసులో ఆరోసారి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం తన ఐదవ భార్య మిచెల్ కాటన్‌కు విడాకులు ఇవ్వగా.. ఇప్పుడు తన 47 ఏళ్ల స్నేహితురాలు నటాషాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం మిచెల్‌ను డేవిడ్‌సన్ వివాహమాడారు. అయితే, 1971లో ఆయన మొదటి భార్యను పెళ్లి చేసుకోగా.. ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. వీరికి పుట్టిన కుమార్తెకు ఇప్పుడు 50 ఏళ్లు.

News April 5, 2024

భారత్ నుంచి మాల్దీవులకు నిత్యావసరాలు

image

మానవతా సాయంగా మాల్దీవులకు నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. బియ్యం, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, గుడ్లు తదితర వస్తువులను పరిమిత స్థాయిలో పంపేందుకు నిర్ణయించింది. వీటితోపాటు కంకర రాయి, నది ఇసుకను కూడా ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా భారత్‌లో వీటి అవసరం ఎక్కువగా లేకపోవడంతో మాల్దీవులకు ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

News April 5, 2024

టీమ్ ఇండియా పాక్ వెళ్లేది అప్పుడే: కేంద్రమంత్రి

image

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వెళ్లే అంశంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీమ్ ఇండియాను పంపించేది లేనిది పూర్తిగా బీసీసీఐ నిర్ణయం. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ముందు ఆ పనిని ఆపాలి. అప్పుడే మన జట్టు అక్కడికి వెళ్తుంది’ అని స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.

News April 5, 2024

SRHvsCSK: తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి ఎంట్రీ

image

ఉప్పల్ వేదికగా జరుగుతున్న SRHvsCSK మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ టీమ్‌లోకి తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
చెన్నై: రుతురాజ్, రచిన్, రహానే, మొయిన్ అలీ, మిచెల్, దూబే, జడేజా, ధోనీ, చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
హైదరాబాద్: అభిషేక్ శర్మ, మర్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్, కమిన్స్, జయదేవ్, భువనేశ్వర్, మార్కండే, నటరాజన్

News April 5, 2024

మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు: KCR

image

TG: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన మిడ్ మానేరును తాము ఆఘమేఘాల మీద పూర్తి చేశామని KCR తెలిపారు. ‘ఆ సందర్భంలో భారీవర్షం కురిసి కట్ట కొట్టుకుపోయింది. అది కట్టింది ఇప్పుడు అడ్డం పొడువు మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంపెనీయే. మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు కాబట్టి అప్పుడు కేసులు పెట్టలేదు. కాళేశ్వరం కూడా అంతే.. త్వరగా నీళ్లందించాలని నిర్మించాం’ అని KCR వెల్లడించారు.

News April 5, 2024

300 పిల్లర్లలో 3 కుంగిపోతే ప్రళయం వచ్చినట్లు చేస్తున్నారు: KCR

image

TG: తనను బద్నాం చేయాలనే కుట్రతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని BRS చీఫ్ కేసీఆర్ ఫైరయ్యారు. ‘కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ నాయకులకు వెంట్రుక కూడా తెల్వదు. మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించాం. 300 పిల్లర్లలో 3 కుంగిపోతే మొత్తం మునిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లు సహజం. మేడిగడ్డ కింద ఇసుక కదిలిపోయింది అంతే. దానికి ఏదో ప్రళయం వచ్చినట్లు హంగామా చేస్తున్నారు’ అని విమర్శించారు.

News April 5, 2024

జగన్ రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారు: చంద్రబాబు

image

AP: ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసాపురం సభలో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసింది. జగన్.. జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చారు. వైసీపీ నాయకులే వాటిని అమ్ముతున్నారు. కిరాయి దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 160 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

News April 5, 2024

రాజకీయాల్లోకి శవాలను తెచ్చింది చంద్రబాబే: వైసీపీ

image

AP: జగన్ సింగిల్‌గా కాదు.. శవాలతో వస్తారని TDP నేత లోకేశ్ చేసిన ట్వీట్‌కు YCP కౌంటర్ ఇచ్చింది. ‘రాజకీయాల్లోకి శవాలను తెచ్చింది నీ తండ్రి చంద్రబాబే. పూటకు గతిలేని నీ తండ్రి శవాలను అడ్డుపెట్టుకుని ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు పెన్షనర్ల చావులకూ ఆయనే కారణం. ప్రతిదానికీ ముగింపు, పరిహారం ఉంటుంది. ఈ ఎన్నికలతో టీడీపీకి, చేతబడులు చేస్తూ బతికే మీ తండ్రీకొడుకుల రాజకీయ కెరీర్‌కు సమాధి తప్పదు’ అని పేర్కొంది.

News April 5, 2024

అందుకే కేసీఆర్ పొలంబాట: సీతక్క

image

TG: ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేసీఆర్ కుటుంబం ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నాయనే భయంతోనే కేసీఆర్ పొలంబాట పట్టారని మండిపడ్డారు. విచారణలో మాజీ సీఎం బంధువులు నిజాలు చెప్తున్నారని తెలిపారు. చేసిన తప్పులకు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని సీతక్క స్పష్టం చేశారు.

News April 5, 2024

నిరోధ్‌లు అమ్ముకొని బతకాలారా కుక్కల కొడుకుల్లారా?: KCR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ CM KCR విరుచుకుపడ్డారు. ‘సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబితే.. పోయేదేముంది వాళ్లను నిరోధ్‌లు అమ్ముకొని బతకమని ఓ కాంగ్రెసోడు అన్నడు. అవి అమ్ముకొని బతకాలారా కుక్కల కొడుకుల్లారా? చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని అంటార్రా దొంగనా కొడుకుల్లారా? మీరు మనుషులా? లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా?’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!