India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్ 2024లో 17 మ్యాచులు ముగిశాయి. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు గిల్ చేసిన 89 పరుగులే. ఇప్పటికీ శతకం నమోదుకాకపోవడంతో మ్యాచులో అసలైన మజా రావట్లేదు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు నమోదయ్యాయి. 9 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటికైనా శతకాల ఖాతా తెరిచి ఐపీఎల్‌కు మరింత ఊపు తీసుకొస్తారో లేదో వేచి చూడాలి.
TG: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు విభాగాల్లోని 1113 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ప్రకారం టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు మే 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఈ <
IPLలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. HYDలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడాయి. 3 మ్యాచుల్లో 2 గెలిచిన CSK 3వ స్థానంలో ఉండగా.. 3మ్యాచుల్లో 1 గెలిచిన SRH 7వ స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ 5వ స్థానానికి చేరుకుంటుంది. MIపై సన్‌రైజర్స్ చేసిన విధ్వంసాన్ని నేడు రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడుతారు. కాగా ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 88.03% పెన్షన్ల పంపిణీ పూర్తైంది. నిన్న ఉ.7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించగా.. ఎక్కువ అనారోగ్య సమస్య ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించారు. మొత్తంగా ఒకటిన్నర రోజుల్లో 57.83 లక్షల మంది లబ్ధిదారులకు ₹1749.53 కోట్లు అందించారు. ఇవాళ కూడా ఉ.7 గంటల నుంచి రా.7 గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినిమా చాలా బాగుందని, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
AP: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(CGHS) లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వం ‘మైసీజీహెచ్‌ఎస్’ యాప్‌ను ప్రారంభించింది. IOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో ఇది పని చేస్తుంది. ఈ యాప్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, క్యాన్సిల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి.
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేయనుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటివ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఈ మేనిఫెస్టోను ఢిల్లీలో ఆవిష్కరిస్తారు.
Sorry, no posts matched your criteria.