India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన, సరిపడినంత నిద్ర అవసరం. అయితే నాణ్యమైన నిద్ర లేనప్పుడే అతి నిద్ర వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు రెగ్యులర్‌గా అతిగా నిద్ర పోతున్నారంటే.. మీ ఆరోగ్యం బాగా లేదని అర్థం. అతిగా నిద్రపోవడం తాత్కాలిక యాంగ్జైటీ, ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. ఓవర్ స్లీప్ మెమరీ పవర్‌ను కూడా ప్రభావితం చేస్తుందట.
AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారంతో రాజకీయంగా లబ్ధి పొందాలని YCP చూస్తోందని MLA వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ‘వాలంటీర్లలో YCP వారు ఉన్నారు కాబట్టే పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని EC ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా TDPపై బురద చల్లుతున్నారు. పెన్షన్ల పంపిణీకి డబ్బులు లేక వాయిదా వేశారు. సుమారు లక్షా యాభై వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని తెలిపారు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో మూవీ అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ఇందుకు సంబంధించిన హింట్స్ ఇచ్చారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తానాడిన తొలి మ్యాచ్‌లోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు. ఇంతకుముందు కూడా IPLలో కొంత మంది ప్లేయర్లు ఇలాంటి ప్రదర్శనే చేసి తమ తొలి మ్యాచ్‌లోనే POTM అవార్డు అందుకున్నారు. మెక్‌కల్లమ్, మైక్ హస్సీ, మహరూఫ్, అక్తర్, గోస్వామి, థెరాన్, పరమేశ్వరన్, రిచర్డ్ లెవి, స్టీవ్ స్మిత్, మనన్ వోహ్రా, ఆండ్రూ టై, ఆర్చర్, అల్జారీ జోసెఫ్, గుర్నీ, ఒడియన్ స్మిత్ ఉన్నారు.
రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, CEOలతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు. ‘అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఉచిత వస్తు పంపిణీని అరికట్టాలి. నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెంచాలి. బోగస్ ఓట్లు పడకుండా సరిహద్దులు మూసేయాలి. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. చెక్‌పోస్టుల్లో CC టీవీలు పెట్టాలి’ అని CEC ఆదేశించారు.
1976: నటి సిమ్రాన్ జననం
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం
1979: కవి అబ్బూరి రామకృష్ణారావు మరణం
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
గనుల అవగాహన దినోత్సవం.
AP: వైసీపీ ఐదో ‘సిద్ధం’ సభ నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 6వ తేదీన జరగనుంది. ఈ మేరకు పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విడుదల చేశారు. కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటి నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. 5వ తేదీన యాత్రకు విరామం ఉంటుంది. 6న కావలి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
తేది: ఏప్రిల్ 4, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55
సూర్యోదయం: ఉదయం గం.6:08
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ డౌన్ అయింది. మెసేజెస్ వెళ్లడం లేదని, ఇతర సేవలు పని చేయడం లేదని ట్విటర్ వేదికగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో వాట్సాప్ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సర్వర్స్‌లో ఇష్యూ కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం యాప్ వర్క్ అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.