News April 3, 2024

ఫిలిం ఛాంబర్‌ సమీపంలో అగ్నిప్రమాదం

image

TG: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఫిలిం ఛాంబర్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. స్వరుచి హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 3, 2024

తైవాన్ ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

image

తైవాన్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు. కాగా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పటివరకు 9 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

News April 3, 2024

సీటెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 2తో గడువు ముగియాల్సి ఉండగా, మరో 3 రోజులు పొడిగించినట్లు తెలిపింది. ఈ పరీక్ష జులై 7న రెండు షిఫ్టుల్లో జరగనుంది. 20 భాషల్లో నిర్వహించనున్నారు.

News April 3, 2024

శివబాలకృష్ణకు బెయిల్

image

TG: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అప్పటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది.

News April 3, 2024

వాటర్ ట్యాంకులో 30 కోతులు మృతి.. ప్రజలకు సరఫరా

image

TG: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో దారుణం జరిగింది. 30 కోతులు నీటి కోసం వెళ్లి మంచినీటి ట్యాంకులో పడి చనిపోయాయి. ఈ సంగతి తెలియని మున్సిపాలిటీ సిబ్బంది ఆ నీటిని ఇళ్లకు సరఫరా చేశారు. 3 రోజుల క్రితం ఆ కోతులు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆ నీరు తాగిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

News April 3, 2024

తగ్గిపోతున్న ఉద్యోగ ఆఫర్లు.. విద్యార్థుల ఆందోళన!

image

ఐఐటీల్లో చదివితే జాబ్ గ్యారంటీ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే IIT బాంబేలో ఈ ఏడాది 36% మందికి జాబ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ప్లేస్‌మెంట్ దొరకని విద్యార్థుల సంఖ్య 2.8% పెరిగింది. దీంతో IITలో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివే వారి పరిస్థితేంటని, నిరుద్యోగ రేటు పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2024

బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!

image

నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ NBK 109. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక బాలయ్యకు తగ్గట్లుగా ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘వీరమాస్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ ఈ సినిమా కోసమేనా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.

News April 3, 2024

పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలి: నరేశ్

image

బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడాన్ని అభినందిస్తున్నట్లు నటుడు నరేశ్ ట్వీట్ చేశారు. ‘రామ మందిరం కల సాకారం కావడానికి అద్వానీ ముఖ్య కారణం. అయితే, మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వకపోవడం బాధిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆయన్ను అవార్డుతో సత్కరించాలని మోదీని అభ్యర్థిస్తున్నా’ అని తెలిపారు.

News April 3, 2024

ఇళ్ల దగ్గర పింఛన్లు అందించడానికి ఇబ్బందేంటి?: పవన్

image

AP: ఇళ్ల దగ్గర పింఛన్లు అందించడానికి ఇబ్బందేంటి అని రాష్ట్ర సీఎస్‌ను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘నా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల వద్ద ఉద్యోగులకు డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సచివాలయ, గ్రామ రెవెన్యూ ఉద్యోగులు పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.

News April 3, 2024

ఏపీలో ప్రచారం చేస్తా: జయప్రద

image

AP: రాష్ట్రంలో TDP తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని BJP నేత, సినీనటి జయప్రద అన్నారు. ‘నేను UPలో ఉంటున్నా.. ఎప్పటికీ తెలుగు బిడ్డనే. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు ఇష్టం. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని లేవు. వాటి కోసం పోరాడుతాను. ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు’ అని ఆమె చెప్పారు.

error: Content is protected !!