India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గ్యారంటీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని.. రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఒక్క రైతుకూ రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. పంట మద్దతు ధరపై రూ.500 బోనస్‌తో పాటు, ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన దాదాపు 4.5 కేజీల బరువు తగ్గినట్లు సమాచారం. కాగా నిన్న ఆయన షుగర్ లెవల్స్ పడిపోవడంతో మెడిసిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనకు కోర్టు 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ సామ్ మానెక్ షా అలియాస్ సామ్ బహదూర్ జయంతి నేడు. ఈయన ఇండో – పాకిస్థాన్ యుద్ధంలో భారత సైన్యాన్ని ముందుండి నడిపించారు. ఈయన ఫీల్డ్ మార్షల్ స్థాయి పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి. యుద్ధం సమయంలో పాక్ సైనికులకు సామ్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు లొంగిపోతారా లేదా మేమే మిమ్మల్ని తుడిచేయాలా?’ అని హెచ్చరించడంతో 93వేల మంది పాక్ సైనికులు లొంగిపోయారు.
మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ దీపక్ పరంబోల్, హీరోయిన్ అపర్ణా దాస్ ఒక్కటవ్వనున్నారు. ఈ నెల 24న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేరళలోని వడకంచేరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా వీరిద్దరూ కలిసి ‘మనోహరం’ సినిమా చేశారు. తెలుగులో ‘ఆదికేశవ’ సినిమాలో అపర్ణ కీ రోల్ పోషించారు. బీస్ట్, దాదా, జాయ్ ఫుల్ ఎంజాయ్ వంటి మలయాళ చిత్రాల్లో ఆమె నటించారు.
IPL అంటేనే ఎమర్జింగ్ ప్లేయర్లకు అడ్డా. ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తోంది. LSG పేస్ గన్ మయాంక్ యాదవ్, RR బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్నారు. పరాగ్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండగా.. మయాంక్ తన స్పీడ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లనే వణికిస్తున్నారు. వీరికి త్వరలోనే భారత జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. T20WCలో చోటు దక్కినా ఆశ్చర్యం అక్కర్లేదు.
విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆలోచించలేదని ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ తెలిపారు. దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజల మూడ్ మారిపోయిందని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను చైనా మార్చడంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీజేపీని ఓడించగలిగే సామర్థ్యమున్న తమకే ప్రజలు ఓట్లేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
AP: సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా నా కుటుంబంపై జగన్ నిరాధార ఆరోపణలు చేశారు. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో మాకు వాటా ఉందని సీఎం ఓ సభలో మాట్లాడారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రికార్డు స్థాయిలో రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అదనంగా 416 కిలోమీటర్లు నిర్మించినట్లు పేర్కొంది. ఇందులో 39 KM కొత్త లైన్లు, 54KM గేజ్ మార్పిడి, 133 KM రెండో లైన్లు, 190KM మూడో లైన్లను నిర్మించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జోన్ ఏర్పాటు తర్వాత ఇదే అత్యధికమని వివరించింది.
2014లో ఉన్న చమురు ధరలను ఇప్పటితో పోల్చుతూ ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘2014 నుంచి ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో లీటర్ పెట్రోల్ రూ.35, డీజిల్‌పై రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?’ అని ప్రశ్నించారు. 2014 APR 2న లీటర్ పెట్రోల్ రూ.72.26 మాత్రమే.
విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై దాఖలైన పిటిషన్‌పై 7రోజుల్లో స్పందించాలని కేంద్రం, ప్రతిపక్షాలను ఢిల్లీ HC ఆదేశించింది. వాదనలు ఈ నెల 10న వింటామని తెలిపింది. ఈ విషయంలో కేంద్రం, ప్రతిపక్షాలకు ఇప్పటికే 8 అవకాశాలిచ్చినా.. స్పందన రాలేదని పిటిషనర్ తరఫు లాయర్ వైభవ్ సింగ్ హైకోర్టుకు తెలిపారు. కాగా.. గతంలో UPAగా ఉన్న విపక్ష కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరు వాడుకుంటోందని ఈ పిల్ దాఖలైంది.
Sorry, no posts matched your criteria.