News April 3, 2024

టీమ్ ఇండియా నుంచి పిలుపు వచ్చేనా?

image

IPL అంటేనే ఎమర్జింగ్ ప్లేయర్లకు అడ్డా. ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తోంది. LSG పేస్ గన్ మయాంక్ యాదవ్, RR బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటున్నారు. పరాగ్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండగా.. మయాంక్ తన స్పీడ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లనే వణికిస్తున్నారు. వీరికి త్వరలోనే భారత జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. T20WCలో చోటు దక్కినా ఆశ్చర్యం అక్కర్లేదు.

Similar News

News April 19, 2026

MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

News April 19, 2026

వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

image

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.

News April 19, 2026

హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

image

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.