India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లెజెండ్ సినిమా తర్వాత విలన్ పాత్రలకు కేరాఫ్‌గా మారారు జగపతిబాబు. అయితే, ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా పేరు అనౌన్స్ చేసినప్పుడు జగపతిబాబు విలన్ ఏంటి అన్నారు చాలామంది. ఆ సినిమా విజయం నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే, సక్సెస్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని మంచి పాత్రలు మాత్రమే చేయగలిగాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: స్కిల్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాకపోవడం ఆయన కర్మ అని YCP MP విజయసాయిరెడ్డి Xలో విమర్శించారు. ‘22 కేసుల్లో స్టే తెచ్చుకుని వ్యవస్థలను మేనేజ్ చేసిన బతుకు మీది. మీడియా, వ్యవస్థల్లో మీరు నాటిన విత్తనాలు వృక్షాలై మీకు గొడుగు పడుతున్నాయి. లేదంటే 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ ఉండేవారు. మిమ్మల్ని మించిన అవినీతి రాజకీయనాయకుడు దేశంలోనే లేరు’ అని ఫైరయ్యారు.
AP: అసెంబ్లీకి పోటీ పడబోయే 114 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇందులో చోటు దక్కింది. నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా పోటీ చేయనున్నారు. అలాగే శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్, కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ బరిలో దిగనున్నారు.
ఏపీ రాజకీయాలపై ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత నరేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం’ అని రాసుకొచ్చారు. ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈరోజుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయన భార్య సాక్షీ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా 2011 వరల్డ్ కప్‌ను గెలిచింది. అలాగే ఏప్రిల్ 2, 2018న లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ రెండింటి ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజైంది ‘లైగర్’. విడుదలకు ముందే దాని కలెక్షన్ల గురించి విజయ్ చాలా గొప్పగా చెప్పారు. తీరా రిలీజయ్యాక మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇకపై మాత్రం అలా మాట్లాడనని అంటున్నారాయన. ఆ సినిమా చెప్పిన పాఠం తర్వాత విడుదలకు ముందే సినిమా గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, ఇది తనకు తానే విధించుకున్న శిక్ష అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు.
అయోధ్యలోని బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి హైదరాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీస్ నడిపేలా స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. SG611 విమానం రోజూ HYD నుంచి 10.45 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ SG616 అయోధ్య నుంచి 13.25 గంటలకు బయలుదేరి 15.25 గంటలకు HYDకి వస్తుంది.
త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ తప్పుకొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రస్తుతం నేను నా ఫిట్‌నెస్, శారీరక సామర్థ్యం మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాను. ఆల్‌రౌండర్‌గా 100శాతం ప్రదర్శన కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందుకే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్నాను’ అని స్పష్టం చేశారు. టెస్టుల్లో ఆడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా OTT రిలీజ్‌పై సందిగ్ధం నెలకొంది. OTT హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చిత్రీకరణ సమయంలో మిస్ అయిన 21రోజుల ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిందట. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఫుటేజీ మిస్సింగ్ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 12న నెట్‌ఫ్లిక్స్‌కి బదులు ‘సన్ నెక్స్ట్’లో ప్రసారం కానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
TG: మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తర్వాత కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చారు. మా వల్లే కరవు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరవు వచ్చింది. మేం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరవు ఎలా వస్తుంది?’ అని ఆయన మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.