India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే పెన్షన్లను ఆపేయడం దారుణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జగన్ 15 రోజుల్లో రూ.13వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు. అలాంటిది పెన్షన్ ఇవ్వడానికి అడ్డేమొచ్చింది? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే.. 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ ఎందుకు అందించలేదు? వాలంటీర్లను ఈసీ వద్దంటే 1.26 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా’ అని పేర్కొన్నారు.
తీహార్ జైలులో కవితకు అవసరమైన వసతులు కల్పించాలని CBI కోర్టు అధికారులను ఆదేశించింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, పేపర్లు, నోట్ బుక్స్, లేసులు లేని బూట్లు ఇవ్వాలని సూచించింది. ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, కవిత ఆభరణాలు ధరించేందుకు అనుమతించాలని పేర్కొంది. మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించడంలేదని ఆమె లాయర్ కోర్టుకు చెప్పడంతో తాజాగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
వేసవి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకవారం తగ్గుతున్న రేట్లు.. మరోవారం పెరుగుతున్నాయి. తాజాగా రేట్స్ మళ్లీ కొండెక్కాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ కేజీ ధర రూ.300గా ఉంది. గతవారం చికెన్ రేట్ కేజీ రూ.220 నుంచి రూ.240 వరకు పలికింది. అయితే కోడిగుడ్ల ధరలు ఊరట కలిగిస్తున్నాయి. గతవారం రూ.7 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.5కు చేరింది.
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 నుంచి 20 రోజులు వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటిరోజు కావడంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు IMPS, AePS, UPI సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. వార్షిక సంవత్సరం ముగింపు కారణంగా రేపు ఉదయం 10 గంటల వరకు DoP చెల్లింపు సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది. వినియోగదారులు గమనించాలని పేర్కొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. రేపటి నుంచి పుష్ప మాస్ జాతర మొదలవుతుందని మేకర్స్ ట్విటర్ వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. వేచి ఉండండి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆ ప్రకటన దేని గురించి ఉంటుందా? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లోని విపక్ష BNP నేతలు ‘బాయ్‌కాట్ ఇండియా’ ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. దీనిపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కౌంటర్ ఇచ్చారు. ‘భారత ఉత్పత్తులను నిషేధించాలని BNP నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి భార్యలు ధరించే భారత చీరలను ఎందుకు పక్కన పడేయడం లేదు. వారి పార్టీ ఆఫీస్ ముందు ఆ చీరలను కాల్చేస్తేనే వారి డిమాండ్‌లో నిజముందని నమ్ముతాను’ అని పేర్కొన్నారు.
హోం గ్రౌండ్(వాంఖడే)లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తాను ఆడిన తొలి బంతికే రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. దీంతో స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత నమన్ ధీర్ కూడా తొలి బంతికే ఎల్‌బీగా వెనుదిరిగారు. మూడో ఓవర్లో బ్రెవిస్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఈ ముగ్గురినీ RR బౌలర్ బౌల్ట్ ఔట్ చేశారు. స్కోర్: 2.2 ఓవర్లలో 14/3.
AP: పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దని ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేశ్ టీడీపీ సానుభూతిపరుడు కాదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువుల ఉసురు పోసుకుని ఆయన బాగుపడతారా? అని ఫైరయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నాన్ని విషపు కూటమి చేస్తోందని దుయ్యబట్టారు.
తిహార్ జైలులో కేజ్రీవాల్‌కు రెండో నంబర్ గదిని కేటాయించారు. ఆయన డైలీ రొటీన్ ఉ.6:30కు ప్రారంభమవుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో టీ, బ్రెడ్ ఇస్తారు. కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే ఆయన తన లాయర్లతో భేటీ కావొచ్చు. ఉ.10:30-11 మధ్య పప్పు, కర్రీ, 5 రొట్టెలు భోజనంగా ఇస్తారు. మ.3:30కి టీ, బిస్కట్లు ఇస్తారు. సా.4కి లాయర్లను మీట్ అవ్వొచ్చు. సా.5:30కి డిన్నర్ ఉంటుంది. రాత్రి 7కల్లా మళ్లీ సెల్‌కి పంపిస్తారు.
Sorry, no posts matched your criteria.